బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కేతమ్మ అనే వృద్ధురాలు కూడా పార్టిసిపెంట్ గా పాల్గొన్నారు. హుషారుగా వచ్చిన కేతమ్మ జడ్జీల ముందు తన జీవిత కష్టాలు చెప్పుకుంది. ఆమె కష్టాలు విని అభిజీత్, బిందుమాధవి, నవదీప్ చలించిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వస్తే వయసు సహకరించకపోయినా పోరాడతానని కేతమ్మ న్యాయ నిర్ణేతలకు తెలిపింది.
25
గంగవ్వ గురించి చెప్పిన అభిజీత్
అభిజీత్ మాట్లాడుతూ గతంలో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఆమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ అక్కడ పరిస్థితులు, ఏసీకి తట్టుకోలేకపోయారు. మీకు బిగ్ బాస్ హౌస్ కష్టం అని అభిజీత్ తెలిపాడు. ఏసీ ఉన్నా నేను తట్టుకుంటా, అన్నీ పనులు చేస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్పింది.
35
కష్టపెట్టడం ఇష్టం లేదు
నిన్ను కష్టపెట్టడం తమకి ఇష్టం లేదని నవదీప్, బిందుమాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. కానీ అభిజీత్ గ్రీన్ ఇవ్వడంతో కేతమ్మ హోల్డ్ లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వస్తే తాను 10 మందితో పోరాడలేకపోయినా ఒక్కరితో అయినా పోరాడతా అని కేతమ్మ తెలిపింది. వంటలు కూడా బాగా వండుతానని పేర్కొంది. ఆ తర్వాత కర్నూలుకి చెందిన ప్రియా అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది.
ప్రియా ఫన్నీగా జడ్జీలకు తనని తాను పరిచయం చేసుకుంది. సీమ బిడ్డ బిగ్ బాస్ కి వచ్చింది. తాట తీస్తా.. తగ్గేదే లే అని డైలాగ్ చెప్పింది. శ్రీముఖి మాట్లాడుతూ ప్రియాని ప్రేమ పెళ్లి గురించి అడిగింది. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని ప్రియా తెలిపింది.
55
అగ్నిపరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు
ప్రియాతో కలిసి నవదీప్ పెళ్లి చూపులు స్కిట్ ని ఫన్నీగా చేశారు. ఈ స్కిట్ లో నవదీప్ అబ్బాయి, అతడి తల్లి శ్రీముఖి.. అమ్మాయి ఏమో ప్రియా. ఈ స్కిట్ లో ప్రియా, నవదీప్, శ్రీముఖి బాగా నవ్వించే ప్రయత్నం చేశారు. మా అత్తగారు శ్రీముఖి కూడా బావున్నారు.. ఇద్దరం కలిసి రీల్స్ చేస్తాం అంటూ ప్రియా సెటైర్లు వేసింది. నవదీప్, బిందుమాధవి ఇద్దరూ ప్రియాకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ప్రియాలోని ఒక వెర్షన్ మాత్రమే చూశానని.. ఆమెలోని మరో వెర్షన్ బయటకి ఇంకా రాలేదని అభిజీత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. దీనితో ఆమె హోల్డ్ లో ఉన్నారు.