బిగ్ బాస్ లో నామినేషన్ వార్.. మూడో వారం ఎంత మంది నామినేట్ అయ్యారంటే?

Published : Sep 22, 2025, 12:43 PM IST

Bigg Boss 9 Telugu Third Week Nominations: బిగ్ బాస్ 9 తెలుగు హౌస్‌లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నామినేషన్స్‌లో మొత్తం 9 మంది నిలిచినట్టు తెలుస్తోంది.

PREV
15
బిగ్ బాస్ లో నామినేషన్ వార్

Bigg Boss 9 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఫన్​లు.. టర్న్​లు.. ట్విస్ట్​లతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలివారం సెలబ్రిటీల నుంచి శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో ఎవరూ ఊహించని విధంగా కామనర్స్ నుంచి మర్యాద హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడోవారం మరో వికెట్ పడటానికి నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. లెటెస్ట్ ప్రోమో చూస్తే.. ఈ వారం ఎలిమినేషన్ ప్రకియ కూడా హోరాహోరీగా సాగింది.

25
నామినేషన్ తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌ రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకూ సెలబ్రెటీల నుంచి ఒకరు ఎలిమినేట్ కాగా, కామరస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండటంతో, బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు. తాజాగా ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్‌లో ఓనర్స్-టెనెంట్స్ మధ్య నామినేషన్స్ తారాస్థాయిలో సాగుతుందనే విషయాన్ని చూపించారు. ఇప్పటి వరకు హౌస్‌లో సెలబ్రిటీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ ఓనర్స్, కామనర్స్ టెనెంట్స్‌గా ఉన్నారు. హోస్ట్ నాగార్జున ఈ రివర్స్ కాంబినేషన్‌ను మళ్లీ అమలు చేశారు.

35
నామినేషన్ల లో బిగ్ ట్విస్ట్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో హరీష్, ప్రియ, శ్రీజ, కళ్యాణ్, డీమాన్ పవన్ ఐదుగురు టెన్నెంట్స్ గా ఉన్నారు. బిగ్ బాస్ సూచన ప్రకారం టెనెంట్స్ ఐదుగురిని నామినేట్ చేసి, బోర్డ్‌పై ఫొటోలు పెట్టి తగిన కారణాలు చెప్పాలి. ఒకరు తప్పనిసరిగా టెనెంట్ కావాలి అనే ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఆ ఐదుగురిలో ఒకరు మాత్రమే టెన్నెంట్ నామినేషన్‌లో ఉండాలి. అంటే, హౌస్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు తప్పనిసరిగా నామినేట్ అవ్వాలి. ఈ క్రమంలో టెన్షన్స్, గొడవలతో బిగ్ బాస్ హౌస్‌ హీటెక్కింది.

45
కామనర్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు

బిగ్ బాస్ 9 మూడో వారం నామినేషన్ లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత హరిత హరీష్ తన వంతుగా హీరోయిన్ సంజనను నామినేట్ చేశారు. “ఆమె కెప్టెన్‌ అయిన తర్వాత కొంత ఈవిల్‌నెస్ కనిపించింది” అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే ప్రియా అవుతూ.. “నాకు కూడా సంజన గారే” అని చెప్పింది. శ్రీజ మాట్లాడుతూ “ఉమెన్‌ను డీగ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు”అని అభిప్రాయపడింది.

ఆ తరువాత ప్రియా రామ్ ఫోటో తీసుకుంది. రాము విషయంలో బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అని పేర్కొన్నారు. దీంతో వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ రియాక్ట్ అవుతూ.. “ఓనర్స్ కంటే ఎక్కువ మీరు తింటున్నారు” అని నామినేషన్‌లో ఆవేశం వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో హరిత-శ్రీజ దమ్ము మధ్య వాదన చోటుచేసుకుంది. ఆ తరువాత డీమోన్ పవన్ రియాక్ట్ అవుతూ “నాకు బూతు కన్న అబద్ధం ఆడటం రాంగ్” అని చెప్పాడు.

55
నామినేషన్ లిస్ట్ ఇదే..

టెనెంట్స్ ఐదుగురిని నామినేట్ చేశారు. ప్రస్తుతం నామినేషన్స్ ప్రకారం: సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరి, రాము రాథోడ్, శ్రీజా దమ్ము, ప్రియాశెట్టి, హరీష్, పవన్ కళ్యాణ్ నామినేషన్ లో నిలిచారు. ఈ మూడో వారం నామినేషన్స్‌లో హరిత హరీష్‌పై సొంత టీమ్ ప్రభావం చూపించింది. ఇదిలా ఉంటే.. హౌస్‌లో డీమాన్ పవన్ కెప్టెన్‌గా ప్రత్యేక అధికారాలను ఉపయోగించి హౌస్‌లో ప్రభావం చూపించాడు. తన స్పెషల్ పవర్ తో శ్రీజ దమ్మూ ను సేఫ్ చేసినట్టు తెలుస్తోంది. వారాంతంలో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు నామినేట్ అవుతారో తదుపరి ఎపిసోడ్‌లో స్పష్టమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories