దయచేసి ఆయనతో మాత్రం మాట్లాడండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ముకుంద అంటూ గట్టిగా కేక పెడుతుంది భవాని. ముకుంద తో పాటు అందరూ హాల్ దగ్గరికి వస్తారు. ఇప్పటికే కృష్ణ నుదుటి మీద గన్ పెట్టి ఉంటుంది భవాని. అందరూ షాక్ అవుతారు. ఈ పిల్ల నా కొడుకుని, నా కూతుర్ని ఇద్దరినీ నా నుంచి దూరం చేసింది, అందుకే నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడి తన ప్రాణాలు తీయటానికి వెనుకాడటం లేదు.