ఇటీవల లయ ఇండియాలో సందడి చేశారు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూతురిని హీరోయిన్ చేయాలన్న కోరిక బయటపెట్టారు. లయ మాట్లాడుతూ... మా అమ్మాయి శ్లోకా గోర్తీ 9వ తరగతి చదువుతుంది. మా ఇద్దరినీ పక్కపక్కన చూసిన చాలా మంది అక్కాచెల్లెళ్ళు అనుకుంటున్నారు. శ్లోకా చాలా అందంగా ఉంటుంది. తనని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆశ ఉంది. అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే మా అమ్మాయికి అవకాశాలు ఇవ్వమని నేను ఎవరినీ అడగను. అలాగే హీరోయిన్ అవ్వు, పరిశ్రమకు వెళ్ళమని నేను తనని బలవంతం చేయను. తన ఇష్టమైన రంగం ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తానని... లయ అన్నారు.