
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మొదటి వారం పూర్తయ్యింది. ఫస్ట్ వీక్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ముందు నుంచి చెప్పినట్టుగానే శ్రష్టి హౌజ్‌ని వీడారు. ఓపెనింగ్ రోజు చాలా కాన్ఫిడెంట్‌గా హౌజ్‌లోకి వచ్చిన ఆమె హౌజ్‌లో ఆ జోరు చూపించలేకపోయింది. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఆమె కంటెంట్ ఇవ్వలేకపోవడంతో కెమెరాల్లో ఫోకస్ కాలేదు. ఆడియెన్స్ ఆమెని రిజెక్ట్ చేశారు. ఆమెకి ఓట్ వేయలేదు. దీంతో మొదటివారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఎలిమినేట్ అయిన సందర్బంగా ఆమె ఏమాత్రం ఫీల్ కాలేదు. ఏదైనా ఓకే అని చెప్పడం విశేషం. ఓపెనింగ్ రోజు త్వరగా బయటకు వచ్చి తనకు సాంగ్ కొరియోగ్రఫీ చేయాలని నాగ్ అనగా, తాను ఓకే అని చెప్పింది. అన్నట్టుగానే వారం రోజుల్లోనే బయటకు రావడం గమనార్హం.
ఇక ఎలిమినేషన్ సందర్భంగా శ్రష్టి వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు బెస్ట్, జెన్యూస్ పర్సన్స్ ఎవరు? ఫేక్, డబుల్ గేమర్ ఎవరు అనేది బయటపెట్టింది. ఈ క్రమంలో రాము రాథోడ్ లో ఫిల్టర్ ఉండదని, చాలా జెన్యూన్ పర్సన్ అని తెలిపింది. ఆయనతోపాటు మర్యాద మనీష్ చాలా స్వీట్ పర్సన్ అని తెలిపింది. చాలా హెల్ప్ చేస్తాడని పేర్కొంది. మరోవైపు హరిత హరీష్ కూడా ఎంతో జెన్యూన్ పర్సన్ అని పేర్కొంది. ఫ్లోరా సైనీది స్వీట్ సోల్ అని, ఎంతో నిజాయితీతో ఉంటారని, బాగా చూసుకుంటారు, బాగా మాట్లాడుతారని తెలిపింది శ్రష్టి వర్మ.
ఇక ఫేక్, డబుల్ గేమర్ ఎవరు? కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనుక మరోలా ఎవరు ఉంటారనేది వెల్లడించింది శ్రష్టి వర్మ. భరణి ఫేక్ పర్సన్ అని చెప్పింది. ఆయన్ని తాను అన్నగా భావించానని, అన్నా అనిపిలిచానని, కానీ తన నమ్మకం కోల్పోయాడని, ఒక్కసారి నమ్మకం పోతే రావడం కష్టమని, భరణి అన్న విషయంలో అదే జరిగిందని పేర్కొంది శ్రష్టి. రీతూ చౌదరీకి కూడా డబుల్ ఫేస్ ఉంటుందని, ఆమె కెమెరా ముందు ఒకలా, వెనకాల మరోలా ఉంటుందని వెల్లడించింది. తనూజ కూడా తన నమ్మకాన్ని బ్రేక్ చేసిందని, డబుల్ గేమర్ అని వెల్లడించింది శ్రష్టి.
ఇక ఆదివారం ఎపిసోడ్‌లో `మిరాయ్`టీమ్ సందడి చేసింది. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. తమ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా స్టేజ్‌పైకి వచ్చిన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక తేజ, రితికాల చేత హౌజ్‌లో కంటెస్టెంట్లని కాసేపు గేమ్ ఆడించారు నాగార్జున. చిట్టీలో ఒకపాట పేరు ఉంటుంది. దాన్ని ఒకరు బొమ్మల రూపంలో వేస్తే, మరొకరు గెస్ట్ చేయాల్సి ఉంది. దీనికోసం హోనర్స్, టెనెంట్స్ సెపరేట్‌గా గేమ్ ఆడారు. ఇందులో హోనర్స్ విజయం సాధించారు.
ఇంకోవైపు టెనెంట్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీల్లో ఒకరు హోనర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు . అందుకోసం టెనెంట్స్ ని రెండు టీములుగా విడగొట్టారు. భరణి, తనూజ, శ్రష్టి వర్మ, రాము రాథోడ్ రెండ్ టీమ్‌గా, రీతూ, ఇమ్మాన్యుయెల్, సంజనా, సుమన్ శెట్టి బ్లూ టీమ్‌గా విడిపోయారు. ఫోరా సంచాలక్‌గా వ్యవహరించింది. ఇందులో మిషన్ల నుంచి వైట్ పేపర్స్ వస్తాయి. వాటిని తీసుకుని స్టాంప్ వేసి పోలింగ్ బూత్ తరహాలో బాక్స్ లో పేపర్స్ వేయాల్సి ఉంటుంది. ఇందులో రెడ్ టీమ్ ఎక్కువగా పేపర్స్ వేశారు. విజయం సాధించారు. వీరిలో ఒకరిని హోనర్స్ గా ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఇతరసభ్యుల ఓటింగ్ ప్రకారం భరణిని ఎంపిక చేశారు. ఇక సోమవారం నుంచి ఆయన హోనర్స్ జాబితాలో చేరిపోయారు. ఆయనకు అసిస్టెంట్‌గా తనూజని ఎంపిక చేసుకోవడం విశేషం.