Bhanupriya: సినిమాలు చేయకపోవడానికి కారణం బయటపెట్టిన భానుప్రియ.. ఈ ఘటనతో స్టార్‌ హీరోయిన్‌ లైఫే తలక్రిందులు

Published : Jan 07, 2026, 07:45 AM IST

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, సీనియర్‌ నటి భానుప్రియ ఇటీవల సినిమాలకు దూరమైంది. ఆమె కొత్తగా సినిమాలు చేయడం లేదు. దానికి కారణం తెలిపారు. తాను వింత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. 

PREV
15
సినిమాలకు దూరంగా భానుప్రియ

ఒకప్పుటి స్టార్‌ హీరోయిన్‌ భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. గతంలో అడపాదడపా ఒకటి అర చిత్రాల్లో నటించారు. కానీ ఇప్పుడు పూర్తిగా మానేశారు. సినిమాల కోసం చాలా మంది మేకర్స్ అప్రోచ్‌ అవుతున్నా ఆమె నో చెబుతున్నారు. అయితే సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం బయటపెట్టారు భానుప్రియ. ఒక్క ఘటన తన జీవితాన్ని తలక్రిందులు చేసినట్టు చెప్పారు.

25
మతిమరుపుతో బాధపడుతున్న భానుప్రియ

భానుప్రియ సినిమాలు మానేయడానికి కారణం తన మతిమరుపేనట. ఆమె తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన మతి మరుపు వల్లే సినిమాలు మానేసినట్టు చెప్పారు. తన భర్త చనిపోవడం వల్ల వ్యక్తిగతంగా చాలా కుంగిపోయానని, దీని కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని, ఓ సినిమా సెట్‌లో డైలాగ్స్ కూడా మర్చిపోయినట్టు చెప్పారు. అందుకే సినిమాలు మానేశానని వెల్లడించారు. అంతేకాదు డాన్స్ స్కూల్‌ కూడా స్టార్ట్ చేయాలనుకుందట. కానీ స్టెప్పులు మర్చిపోవడం వల్ల అది కూడా చేయలేదని వెల్లడించారు.

35
హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన భానుప్రియ భర్త

భానుప్రియ హీరోయిన్‌గా పీక్‌లో ఉన్న సమయంలోనే ఆదర్శ్‌ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. ఆయన డిజిటల్‌ గ్రాఫిక్స్ ఇంజనీర్‌. 2002లో వీరికి ఒక కూతురు అభినయ జన్మించారు. కొన్నాళ్లు కాలిఫోర్నియాలోనే ఉన్న భానుప్రియ ఆ తర్వాత ఇండియాకి వచ్చారు. మళ్లీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. పలు సినిమాలు కూడా చేశారు. కానీ 2018లో భానుప్రియ భర్త ఆదర్శ్‌ కన్నుమూశారు. ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో ఒంటరైపోయింది భానుప్రియ. అది ఆమెని మానసికంగా ఇబ్బందికి గురిచేసింది. దీంతో మతిమరుపు ఆమెని వెంటాడుతుంది. దాని కారణంగానే ఇప్పుడు సినిమాలు చేయడం లేదట.  

45
భానుప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్న దర్శకుడు వంశీ

భానుప్రియని దర్శకుడు వంశీ మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. వంశీ రూపొందించిన `సితార`, `ప్రేమించు పెళ్లాడు`, `అన్వేషణ` వంటి చిత్రాల్లో హీరోయిన్‌ గా చేశారు భానుప్రియ. ఈ క్రమంలోనే ఇద్దరి మనుషులు కలిశాయి. అప్పటికే వంశీకి మ్యారేజ్‌ అయ్యింది. అయినా భానుప్రియని వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ అందుకు భానుప్రియ తల్లి ఒప్పుకోలేదు. అలా వంశీకి దూరమయ్యారు భానుప్రియ.

55
భానుప్రియ చేసిన తెలుగు సినిమాలు

భానుప్రియ తెలుగులో `సితార`తో బిగ్‌ బ్రేక్‌ అందుకున్నారు. `అన్వేషణ`, `ఇళ్లాలే దేవత`, `చిరంజీవి`, `జ్వాలా`, `విజేత`, `మంచి మనుసులు`, `శ్రీనివాస కల్యాణం`, `దొంగమొగుడు`, `అల్లరి కృష్ణయ్య`, `ధర్మపత్ని`, `స్వర్ణకమలం`, `గూఢచారి 117`, `పెదరాయుడు` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుని`అన్నమయ్య`, `జయం మనదేరా`, `ఛత్రపతి` వంటి చిత్రాలు చేశారు. చివరగా ఆమె తెలుగులో `నాట్యం` మూవీలో మెరిశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories