Published : Jan 06, 2026, 10:33 PM ISTUpdated : Jan 08, 2026, 11:42 AM IST
Akhanda 2: బాలకృష్ణ చివరగా `అఖండ 2` తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నెక్ట్స్ ఆయన `ఎన్బీకే 111` చేయబోతున్నారు. అయితే ఇప్పుడు దీన్ని హోల్ట్ లో పెట్టినట్టు సమాచారం.
బాలకృష్ణ చివరగా `అఖండ 2` చిత్రంలో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన నాల్గో చిత్రమిది. అంతకు ముందు వచ్చిన `సింహ`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలుగా నిలిచాయి. ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. కానీ రెండో హ్యాట్రిక్‌కి రెడీ అయిన వీరికి చేదు అనుభవం మిగిలింది.
25
వాయిదా `అఖండ 2`పై తీవ్ర ప్రభావం
`అఖండ 2` ప్రారంభం నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన మూవీ కావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. శివతత్వం ప్రధానంగా రూపొందడం, బాలయ్య, బోయపాటి కాంబో వరుస విజయాలు సాధించడం, పైగా `అఖండ 2`కిది సీక్వెల్ కావడంతో రూ.103కోట్ల వ్యాపారం జరిగింది. కానీ ఆ స్థాయి కలెక్షన్లని సాధించడంలో విఫలమయ్యిందీ చిత్రం. ఆడియెన్స్ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది. అనుకున్న టైమ్ కి రిలీజ్ కాకపోవడం ఈ మూవీపై తీవ్ర ప్రభావం పడింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
35
పీరియాడికల్ అండ్ హిస్టారికల్ కథతో ఎన్బీకే 111
`అఖండ 2` తర్వాత బాలకృష్ణ నెక్ట్స్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆ మధ్యనే ఈ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ చిత్రాన్ని పీరియాడికల్ అండ్ హిస్టారికల్ యాక్షన్ మూవీగా రూపొందించాలని ప్లాన్ చేశారు. ఆ కాన్సెప్ట్ ని ప్రతిబింబించేలా టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఓ పాత్రలో రాజుగా, మరో పాత్రలో యోధుడిగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని భారీ హిస్టారికల్ మూవీగా డిజైన్ చేశారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య క్యారెక్టరైజన్స్ ని ప్లాన్ చేశారట.
అయితే ఇలాంటి మూవీ తీయాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. వంద నుంచి రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి భారీ బడ్జెట్‌ని రికవరీ చేయడం చాలా కష్టం. దీంతో బడ్జెట్ కంట్రోల్ చేసే పనిలో నిర్మాతలున్నారు. దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని సమాచారం. పీరియడ్, హిస్టరీ ఎపిసోడ్స్ ని లేపేసి, రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా చేసే పనిలో ఉన్నారట. దానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కథ వర్కౌట్ అయితే మూవీ ఉంటుంది, లేదంటే ఆగిపోయే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికైతే ఇది హోల్డ్ లోనే ఉందని టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
55
బాలయ్య, గోపీచంద్ కాంబోలో చివరగా `వీర సింహారెడ్డి` మూవీ
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చివరగా `వీరసింహారెడ్డి` మూవీ రూపొందింది. మూడేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లని రాబట్టింది. యాక్షన్ మూవీ అయినా, ఆడియెన్స్ ని మెప్పించింది. ఓవరాల్‌గా సక్సెస్ అయ్యింది. దీంతో గోపీచంద్‌కి మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఈ సారి భారీగా ప్లాన్ చేశారు. కానీ అది బెడిసికొట్టేలా ఉంది.