ఇక కాంట్రవర్శియల్ స్టార్ గా కూడా ఆమెకు పేరుంది. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయినతరువాతే.. భానుమతి ఎక్కువ ప్రయోగాలు చేసింది.. అద్భుతమైన పాత్రలు చేసే అవకాశం ఆమెకు వచ్చింది. మంగమ్మగారిమనవడు, సూపర్ కార్ లాంటి ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
అంతే కాదు హీరోలను మించి ఫైటింగ్ లు కూడా చేసిన నటి భానుమతి. ఆమె పాత్రలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటలను ఇప్పటికీ వింటూనే ఉన్నారు ఆమె అభిమనులు. కాగా భానుమతి సంబంధించి ఓన్యూస్ గతంలో వైరల్ అయ్యింది. ఆమె చివరి రోజుల్లో ఎంతో ఇబ్బందిపడిందని ప్రచారం జరిగింది.