అల్లు అర్జున్ - రాజమౌళి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు..? కారణం ఏంటో తెలుసా..?

తెలుగులో టాప్ స్టార్స్ తో సినిమాలు చేసిన రాజమౌళి.. అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? సినిమా చేసే ప్రయత్నమే చేయలేదా..? కుదరలేదా..? 
 

టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమాకు ఆస్కార్ గౌరవం దక్కేలా చేసిన దర్శకుడు జక్కన్న. తెలుగు హీరోలను పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ గా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ లో దాదాపు అందుు స్టార్లతో సినిమాలు చేసిన ఆయన అల్లు అర్జున్ తో మూవీ చేయకపోవడానికి కారణం ఏంటి..? 

నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే
 

రాజమౌళి సినిమా చేయని స్టార్ హీరోలు.. అంటే టైర్ 1 హీరోలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నారు. చిరంజీవి కూడా చరణ్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి.. రాజమౌళి సినిమాలో నటించిన క్రెడిట్ కొట్టేశాడు.

అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా  చేయాలని చూసిన రాజమౌళికి.. ఆతరుత వర్కౌట్ అవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. ఇక రాజమౌళి సినిమా చేయని టైర్ 1 హీరోలలో అల్లు అర్జున్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో బన్నీ ఎంత పెద్ద స్టారో అందరికి తెలుసు.

అయితే జక్కన్న అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అస్సలు ప్రయత్నమే చేయలేదా అని అందరికి అనుమానం ఉంది. అయితే బన్నీతో రాజమౌళి సినిమా చేసే ప్రయత్నం చేశారట. 

మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్


రాజమౌళి బాహుబలి తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేసే ప్రయత్నం చేశారట. కాని అది వర్కౌట్ అవ్వలేదని సమాచారం. అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో టాక్ ఏంటంటే.. తమిళ స్టార్ హీరో అజిత్, అల్లు అర్జున్ తో కలిపి మల్టీ స్టారర్ ఒకటి ప్లాన్ చేశాడట.

కాని అది వర్కౌట్ అవ్వకపోవడంతో.. ఆర్ఆర్ఆర్ ను ప్లాన్ చేశాడట జక్కన్న. అయితే ఆతరువాత కూడా బన్నీతో సినిమా చేయాలి అనుకున్నాడట రాజమౌళి. కాని ఏదొ ఒక కారణంగా సినిమా వర్కౌట్ అవ్వలేదట.

ప్రస్తుతం తెలుగు సినిమాకు పాన్ వరల్డ్ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. అందుకే అమెజాన్ అడ్వెంచర్ మూవీతో రాబోతున్నాడు. 

ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు
 

మహేష్ బాబుతో ఈమూవీ సక్సెస్ ఫుల్ గా చేయగలిగితే.. టాలీవుడ్ హాలీవుడ్ లో ఒక భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ పేరే వినిపిస్తుంది.

ఇక హాలీవుడ్ లో కూడా తెలుగు సినిమా ఇండియన్ సినిమా గుర్తింపుతో భారీ స్థానాన్ని సంపాదించుకునే అవకాశంతో పాటు.. ప్రతీ ఏడాది ఆస్కార్ లిస్ట్ లోకి వెళ్లడానికి రూట్ దొరుకుతుంది. 

చూడాలి మంరి మహేష్ బాబు మూవీ ఆ ఘనత సాధిస్తుంద లేదా అనేది. ఇక త్వరలో ఈమూవీ ఓపెనింగ్ జరుగుతుంది అని సమాచారం. అఫీషియల్ గా మాత్రం ఇంత వరకూ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. మహేష్ బాబు మాత్రం రీసెంట్ గా కంప్లీట్ మేకోవర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. 

ఎన్టీఆర్ ‌- పవన్ కళ్యాన్ తో మల్టీ స్టారర్
 

ఇక బన్నీతో జక్కన్న సినిమాకోసం ఫ్యాన్స్ కూడా ఎదరు చూస్తున్నారు. పుష్ప2తో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఈ ఇమేజ్ తో.. రాజమౌళి.. బన్నీతో భారీ సినిమానే ప్లాన్ చేసే అవకాశం ఉంది. కాని అది ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఐదు పదేళ్ల తరువాతైనా ఈ కాంబో కలిస్తే బాగుండు అనుకుంటున్నారు ఫ్యాన్స్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Latest Videos

click me!