నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో తెలుగు సినిమాలు!

First Published | Dec 29, 2024, 10:31 AM IST

నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ సినిమాలకు పెరుగుతున్న ఆదరణతో, తెలుగు సినిమా 'లక్కీ భాస్కర్' టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు సంపాదించింది. ఈ జాబితాలో 'జిగ్రా' మొదటి స్థానంలో ఉండగా, వివిధ జానర్‌ల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

netflix, lucky bhaskar, devara, amaran


పాపులర్  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ లో మన దేశ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్స్ కు  ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. మంచి మార్కెటింగ్ ప్లాన్స్ , భారీ ప్రేక్షకులు సినిమాలను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తున్నాయి.

ఇంతకు ముందు పెద్దగా మన సినిమాలకు ప్రయారిటీ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు రోజు రోజుకీ పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ...సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేసి, ట్రెండింగ్ లో ఉంచుతోంది నెట్ ప్లిక్స్, అమేజాన్.

ఎందుకు నెట్ ప్లిక్స్  మన ఇండియా  సినిమాలపై స్పెషల్ ఎటెన్షన్ పెడుతోంది అంటే.. ప్లాట్‌ఫారమ్‌లో  రోజు రోజుకీ పెరుగుతున్న భారతీయ ప్రేక్షకుల సంఖ్య అనే చెప్పాలి.  ఇండియా కంటెంట్ ని  ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ  నెట్‌ఫ్లిక్స్  ప్రజాదరణ పొందుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో భారీ ప్రేక్షకులు  ఉండటానికి కారణం ఇక్కడ సినిమాలకు ప్రయారిటీ ఇవ్వటమే.  అంతేకాకుండా  తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకతగా మారింది. 
 


Vijayakanth


ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో దాదాపు అన్ని రకాల జానర్స్ సినిమాలు లభ్యమవుతున్నాయు. ముఖ్యంగా  క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఉంది. దాదాపు ప్రతీ జోనర్ ఇష్టపడే వాళ్లకి వారికి సరబడ మూవీస్ అందుబాటులో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రతివారం గ్లోబల్, ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదే క్రమంలో  లేటెస్ట్గా నెట్‌ ఫ్లిక్స్ ఇండియన్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్,వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో మన తెలుగు సినిమా లక్కీ భాస్కర్ ఉంది. 
 


 ఈ లిస్ట్ లో నెంబర్ వన్ గా నెట్‌ఫ్లిక్స్ నాన్-ఇంగ్లీష్ సినిమాల స్ట్రీమింగ్ సైట్‌లలో ర్యాంకింగ్ ప్రకారం మొదటి చిత్రం వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రా నిలిచింది.ఈ సినిమాకు  కరణ్ జోహార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు.

మెట్రోపాలిటన్ నగరాలను కేంద్రంగా చేసుకుని సాగే ఈ సినిమా కథాంశాన్ని తీసుకోవటమే నెట్ ప్లిక్స్ జనాల్లో మరింత ఆదరణ పొందటానికి కారణమైంది. థియేటర్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాని సినిమా నెట్ ప్లిక్స్ లో మాత్రం ట్రెండింగ్ లో ఉంది.
  

elevator or a coffin

 
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్

1.  జిగ్రా

2.  విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో

3. అమరన్

4.సికందర్ కా ముకద్దర్ & తంగలన్ 
 
5.     లక్కీ భాస్కర్

 6.  దేవర

7.  మేరీ

8.  దట్ క్రిస్మస్

9.  దో పత్తి

10.  మేయళగన్ (సత్యం సుందరం) 

Latest Videos

click me!