నోరు విప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకుంది, నా వెంట్రుకలు కాదు వాటి గురించి మాట్లాడాల్సింది... చిట్టిబాబు సంచలనం!

Published : Apr 26, 2023, 07:28 AM IST

నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద ఫైర్ అయ్యారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి చేసిన పోస్ట్ కి కౌంటర్ ఇచ్చాడు.   

PREV
16
నోరు విప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకుంది, నా వెంట్రుకలు కాదు వాటి గురించి మాట్లాడాల్సింది... చిట్టిబాబు సంచలనం!
Samantha

నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై మరొకరు కౌంటర్స్ వేసుకుంటున్నారు. నిర్మాత చిట్టిబాబు రెండు మూడు సందర్భాల్లో సమంతను టార్గెట్ చేశారు. ఆమె అనారోగ్యం అంతా నాటకం. సింపతీతో తన సినిమాలకు ప్రచారం తెచ్చుకోవాలని చూస్తుంది. సమంత ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరు, అన్నారు. 
 

26
Samantha

ఆయన ఇంకా కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. సమంత స్టార్డం ఎప్పుడో పోయింది. బ్రతుకుదెవరు కోసం వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ పోతుంది. ఆమెకు గ్లామర్ లేదు. ముసలి ముఖం. శాకుంతలం మూవీకి సమంతను ఎందుకు తీసుకున్నారు? అలాంటి పాత్ర ఆమె ఎలా చేయగలదు? అందుకే సినిమా ఫలితం నెగిటివ్ గా వచ్చిందంటూ సమంత పట్ల తన అసహనం వ్యక్తం చేశాడు. 
 

36

సమంత ఇటీవల చిట్టిబాబు కామెంట్స్ పై పరోక్షంగా స్పందించారు. చిట్టిబాబు మీద ఒక సెటైర్ పోస్ట్ చేశారు. చిట్టిబాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని ప్రస్తావిస్తూ... చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్ లో సెర్చ్ చేస్తే... టెస్టోస్టిరాన్ అధికం కావడం వలన అని చూపించింది, అని ఒక పోస్ట్ పెట్టింది. పచ్చిగా చెప్పాలంటే నిర్మాత చిట్టిబాబు మదంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని పేరు చెప్పకుండా కౌంటర్ వేసింది. 
 

46

దీనిపై చిట్టిబాబు తాజాగా స్పందించారు. సమంతను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను కూడా సమంత పేరు చెప్పడం లేదు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు, నా మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేది, అని అన్నారు. 
 

56
Samantha


నేను నోరు విప్పితే సమంత పరువు పోతుంది అన్నట్లు చిట్టిబాబు మాట్లాడాడు. తన చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడినందుకు చిట్టిబాబు హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. మరి చిట్టిబాబు కామెంట్స్ కి సమంత స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. 

66

యశోద విడుదలకు ముందు సమంత తనకు మయోసైటిస్ సోకినట్లు సోషల్ మీడియా ప్రకటన చేశారు. మరలా శాకుంతలం ప్రమోషన్స్ లో తాను పూర్తిగా కోలుకోలేదని, సమస్య అలానే ఉందని చెప్పుకొచ్చారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిణామాలను చిట్టిబాబు తప్పుబడుతున్నారు. సమంత చేస్తున్న ఛీప్ ట్రిక్స్ గా అభివర్ణిస్తున్నారు.

click me!

Recommended Stories