మీకేమైనా అయిందంటే ఆయన చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏం చేసినా మీ బాగు కోసమే చేశారు, అలాంటిది మీకు ఏమైనా అయిందంటే ఆయన తట్టుకోగలరా అంటూ నీరజ్ కి ధైర్యం చెబుతుంది. తరువాత నీరజ్ తో శారదమ్మని, మాన్సీని చూసుకోమని చెప్పి జెండే, అను ఇద్దరు ఆర్య దగ్గరికి బయలుదేరుతారు. జైల్లో ఆర్యని చూసిన అను కన్నీరు పెట్టుకుంటుంది. మీరు త్వరగా బయటికి వచ్చేయండి లేకపోతే నన్ను లోపలికి రానివ్వండి అంటూ ఎమోషనల్ అవుతుంది. నేను బయటికి రావటం కాదు, నన్ను నమ్ముకుని ఉన్న కొన్ని వేల మందిని బయటికి తీసుకురావాలి.