ఇండియన్ సినిమాలో మరో అల్లు అర్జున్ అతడే, రాసిపెట్టుకోండి.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

Published : Oct 19, 2025, 07:17 PM IST

Bandla Ganesh: దీపావళి సెలెబ్రేషన్స్ లో నిర్మాత బండ్ల గణేష్.. యంగ్ హీరో తేజ సజ్జాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
బండ్ల గణేష్ దీపావళి పార్టీ 

హైదరాబాద్‌లో నిర్మాత బండ్ల గణేష్ ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, తేజ సజ్జా వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై వేడుకను మరింత రంగులమయం చేశారు.

25
ఇండియన్ సినిమాకి నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే 

ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ తన ఉత్సాహభరితమైన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకంగా యువ నటుడు తేజ సజ్జా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. గణేష్ మాట్లాడుతూ, “తేజ సజ్జా తర్వాతి అల్లు అర్జున్ అవుతాడు. ఇది రాసిపెట్టుకోండి అని బండ్ల గణేష్ తేజ సజ్జా పై ప్రశంసలు కురిపించారు. ఆయనలో ఉన్న ఎనర్జీ, స్టైల్, డెడికేషన్ చూస్తే భవిష్యత్తులో ఇండియన్ సినిమా స్థాయిలో పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.

35
మిరాయ్ తో సంచలన విజయం 

ఈ వ్యాఖ్యలు విన్న అక్కడి సినీ ప్రముఖులు, అభిమానులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. తేజ సజ్జా ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న యువ హీరోలలో ఒకరిగా నిలుస్తున్నారు.తేజ సజ్జా తాజాగా నటించిన “మిరాయ్” సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ సజ్జా యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

45
త్వరలో జాంబీ రెడ్డి 2

మిరాయ్ తర్వాత తేజ మళ్లీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేతులు కలపబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా “జాంబీ రెడ్డి 2”. ఇది వారి మూడవ కలయిక కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

55
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభం 

తేజ సజ్జా చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి, బాలనటుడిగా పలు హిట్ చిత్రాల్లో నటించాడు. తరువాత హీరోగా మారిన ఆయన, “జాంబీ రెడ్డి”,  “హనుమాన్”, “మిరాయ్” వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టులు యువతలో భారీ క్రేజ్‌ను సృష్టిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories