Actor: ఈ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. కానీ ఒకప్పుడు తన వారసత్వపు బిజినెస్ అయిన మామిడి పండ్ల వ్యాపారం చేసేవాడు. మరి అతడెవరని అనుకుంటున్నారా.? ఓ సారి ఈ వార్తపై లుక్కేయండి మరి.
ఒకప్పుడు ఈ హీరో బ్రతుకుదెరువు కోసం తన వారసత్వపు వ్యాపారంలో కష్టపడ్డాడు. అదేనండీ.! మామిడిపండ్ల వ్యాపారిగా విదేశాలకు ఎగుమతి చేసేవాడు. కట్ చేస్తే..! ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో అయ్యాడు. తోపు యాక్టర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిశాడు. మరి అతడెవరో కాదు కునాల్ కపూర్.
25
పంజాబీ కుటుంబంలో జననం..
1975 అక్టోబర్ 18న నటుడు కునాల్ కపూర్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇండస్ట్రీలోకి రాకముందు హాంకాంగ్‌లో ఉన్న కునాల్.. అక్కడ అతడు తన కుటుంబంతో కలిసి మామిడి పండ్ల వ్యాపారం చేసేవాడు. ఆపై సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి నటించిన ఆక్స్(2001) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.
35
హీరోగా అరంగేట్రం..
ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్సీ: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్(2004) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. అయితేనేం కునాల్ నటనకు ప్రశంసలు దక్కాయి. నెమ్మదిగా అవకాశాలు కూడా రావడం మొదలుపెట్టాయి.
2006లో వచ్చిన 'రంగ్ దే బసంతి' సినిమాతో కునాల్ కపూర్‌కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. అలా అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను సాధించాడు. తద్వారా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి.
55
అమితాబ్ బచ్చన్‌తో కునాల్ కపూర్ రిలేషన్..
అజితాబ్ బచ్చన్ కుమార్తె నైనా బచ్చన్‌ను కునాల్ కపూర్ వివాహం చేసుకున్నాడు. అలా అమితాబ్ బచ్చన్ కుటుంబానికి అల్లుడు అయ్యాడు కునాల్. కునాల్, నైనా 2015లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. కునాల్ వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఎక్కువగా వార్తల్లో నిలవడం కంటే.. తన పని మీద దృష్టి సారిస్తాడు కునాల్.