సౌందర్య వస్తుందని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్న బాలకృష్ణ, అంతలోనే పెద్ద షాక్‌, అదే చివరి సినిమా

Published : Mar 08, 2025, 11:09 AM IST

బాలకృష్ణ, సౌందర్య కాంబినేషన్‌లో ఒకే ఒక్క మూవీ వచ్చింది. మరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ మూవీ షూటింగ్‌లో ఏం జరిగిందనేది చూస్తే   

PREV
15
సౌందర్య వస్తుందని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్న బాలకృష్ణ, అంతలోనే పెద్ద షాక్‌, అదే చివరి సినిమా
balakrishna, soundarya

సౌందర్య సౌత్‌తోపాటు అన్ని హిందీలోనూ నటించింది. దాదాపు అందరు టాప్‌ హీరోల సరసన జత కట్టింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఎక్కువసార్లు మూవీస్‌ చేసింది. కానీ బాలయ్యతో మాత్రం రెండే సినిమాలు చేసింది. ఒకటి పూర్తి మూవీ అయితే, మరోటి మధ్యలోనే ఆగిపోయింది.

25

బాలకృష్ణతో సౌందర్య మొదటిసారి `టాప్‌ హీరో` సినిమాతో జోడీ కట్టింది. 1994లో ఈ చిత్రం విడుదలైంది. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆమని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత పదేళ్ల వరకు వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు. 
 

35

కానీ 2004లో పౌరాణిక చిత్రం `నర్తనశాల`లో నటించారు. ఈ మూవీతో బాలకృష్ణనే దర్శకుడిగా మారారు. ఇందులో ద్రౌపదిగా నటించింది సౌందర్య. ఇందులో బాలకృష్ణ మూడు రోల్స్ చేశారు. అర్జునుడు, బృహన్నల, కీచకుడు పాత్రలు పోషించారు.

లేట్‌ శ్రీహరి కూడా ఇందులో భీముడు పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా మార్చి 1న షూటింగ్‌ ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్‌ చేశారు. సౌందర్య కూడా పాల్గొంది. 
 

45
narthanasala

ఏప్రిల్‌ 17న షూటింగ్‌ కోసం బాలకృష్ణ రెడీ అయ్యాడు. సెట్‌ అంతా రెడీ చేశాడు. ఆ రోజు సౌందర్య షూటింగ్‌కి రావాల్సి ఉంది. ఆమెకోసమే బాలయ్యతో సహా టీమ్‌ అంతా వెయిట్‌ చేస్తున్నారు. కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటకు వచ్చింది. సౌందర్య హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిందనే వార్త విని అంతా షాక్‌ అయ్యారు.

యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్, సాధారణ జనం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సౌందర్య మరణించిందనే వార్తతో షాక్‌లోకి వెళ్లారు. అది `నర్తనశాల` టీమ్‌కి సైతం పెద్ద షాకిచ్చే వార్త. సౌందర్య మరణంతో ఆ మూవీనే ఆపేశారు. 
 

55
soundarya

అలా బాలయ్య, సౌందర్య కాంబినేషన్‌లో రెండో సినిమా ఆగిపోయింది. అయితే అప్పటికే కొంత పార్ట్ షూట్‌ చేశారు. దాన్ని ఎడిటింగ్‌ చేస్తే 17 నిమిషాల ఫూటేజ్‌ వచ్చింది. దాదాపు 16ఏళ్ల తర్వాత బాలకృష్ణ ఆ ఫూటేజీ ఎడిటింగ్‌ చేయించి ఓటీటీలో రిలీజ్‌ చేశారు.

వచ్చిన డబ్బులను ఛారిటీకి ఇచ్చారు. అయితే దీనికి పెద్దగా స్పందన రాలేదు. అది అప్పటికే చాలా ఏళ్లది కావడం, కంటెంట్‌ సరిగా లేకపోవడంతో ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సౌందర్య నటించిన చివరి మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. 

read  more:  రామ్‌ చరణ్‌ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్‌ అయిన సందర్భం

also read: ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్‌ చేసుకున్న సెన్సేషనల్‌ స్టార్‌ ఎవరో తెలుసా? తారకరత్న కాదు.. అప్పట్లో ఆయనో సునామీ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories