Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తన వాయిస్ రహస్యాన్ని వెల్లడించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Rajinikanth distinctive voice technique, in telugu
Rajinikanth: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా వెలిగే రజనీకాంత్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. అలాగే ఆయనకు కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ అసలే లేదు. నిజ జీవితంలోనే కాదు, తెరపైనా లేటెస్ట్ ట్రేండ్ అసలే ఫాలో కాడు. అందరు తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు.
అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడుగా ఆయన్ని తమిళంవాళ్లు చెప్తూంటారు. తెరపై అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్.
అయితే ఆయనకు ఆయన స్టైల్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో,వాయిస్ కూడా అంతే పేరు తెచ్చి పెట్టింది. ఆయన వాయిస్ కల్చర్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటనేది గతంలో ఓ సారి ఆయన తమిళ మీడియాకు చెప్పారు.
23
Rajinikanth distinctive voice technique, in telugu
తన కంఠస్వరాన్ని చక్కగా వినిపించేలా, సినిమాల్లోకి వచ్చినప్పటినుండీ ప్రాక్టీసు చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. మీ వాయిస్ రహస్యం ఏమిటి? అని అడి గితే,. “ఉదయం లేవగానే జీలకర్ర వేసి మరి గించిన వేడి నీటిని నోట్లోపోసుకుని, కాసేపటి వరకూ ఆయిల్పుల్లింగ్ పుక్కిలిస్తుంటాను.
దీన్ని కొంతసేపు చేస్తాను. అటుపైన నా కం ఠాన్ని అదుపులో ఉంచుకుంటూ బేస్ వాయి నీతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తాను.. రోజూ కొన్ని నిమిషాలపాటు ఇలా చేస్తే చక్కని, నియంత్రణగల సుస్వరం సొంతమవుతుంది. ఇదే నా వాయిస్ రహస్యం, ఎవరైనా ఇలా చేయచ్చు, చాలా ఈజీ " అంటున్నాడు రజనీకాంత్.
33
Rajinikanth distinctive voice technique, in telugu
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాల విషయానికి వస్తే...ఆయన హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 1న విడుదల కాబోతున్న కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ భారీగా ఉంది.
తమిళనాట ఈ సినిమాకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కూలీ సినిమాకు అన్ని చోట్ల భారీగా బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ సినిమాలకు మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. అందుకే కూలీ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం కోసం రెడీ అయిందట.