తప్పు తెలుసుకున్న బాలకృష్ణ.. సక్సెస్‌ సీక్రెట్‌ రివీల్‌.. ఇతర హీరోలకు ఆయనిచ్చిన సలహా ఇదే

Published : Nov 29, 2025, 08:57 AM IST

బాలకృష్ణ ఇటీవల పరాజయం లేకుండా రాణిస్తున్నారు. వరుసగా నాలుగు విజయాలు సాధించారు. ఈ క్రమంలో ఆయన తన సక్సెస్‌ సీక్రెట్‌ని బయటపెట్టారు. తాను తప్పులు చేసినట్టు చెప్పారు. 

PREV
15
బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు హిట్లు కొట్టారు. `అఖండ`తో స్టార్ట్ చేసి, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. డిసెంబర్‌ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మరో హిట్‌ ఖాయమని ఇప్పటికే ప్రకటించారు బాలయ్య. నెక్ట్స్ మూవీ కూడా సక్సెస్‌ కాబోతుందని తన కాన్ఫిడెన్స్ ని వెల్లడించారు.

25
నేను తప్పు చేశాను

ఇదిలా ఉంటే బాలయ్య తన సక్సెస్‌ సీక్రెట్‌ని బయటపెట్టాడు. తాను సినిమాల ఎంపికలో తప్పు చేసినట్టు తెలిపారు . `అఖండ`కి ముందు బాలయ్యకి వరుసగా పరాజయాలున్నాయి. `రూలర్‌`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌, `పైసా వసూల్‌` చిత్రాలు పరాజయం చెందాయి. `గౌతమీపుత్ర శాతకర్ణి` బాగానే ఆడింది. అంతకు ముందు `డిక్టేటర్‌`, `లయన్‌` చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. `లెజెండ్‌`కి ముందు ఐదు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. `సింహ`కి ముందు 9 సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. మధ్యలో `లక్ష్మీ నరసింహ`, `చెన్నకేశవరెడ్డి` చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఏకంగా 13 పరాజయాలుగా చెప్పొచ్చు.

35
సినిమా కథలో ఆత్మ పట్టుకోవాలి

కానీ ఇప్పుడు ఓటమి లేకుండా దూసుకుపోతున్నారు బాలయ్య. తనతోటి హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జునలకు కూడా సాధ్యం కాని విధంగా ఆయన సక్సెస్‌ అవుతున్నారు. తాజాగా ఆ రహస్యం బయటపెట్టారు. తాను పరాజయాల నుంచి తప్పు తెలుసుకున్నట్టు తెలిపారు. `నేను కొన్ని తప్పులు చేశాను. అప్పుడు తెలుసుకున్నాను సినిమా కథలో ఆత్మని పట్టుకోవాలని. సినిమా అంటే ఒక ఆత్మ, నన్ను అర్థం చేసుకుని, మిమ్మల్ని(అభిమానులు) అర్థం చేసుకుని వెళ్లాలి. నేను ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తాను. భోజనం చేస్తున్నా, వేరే పనిలో ఉన్నా కూడా మీ గురించే ఆలోచిస్తాను. మంచి సినిమా ఇవ్వాలి, మంచి సందేశం ఇవ్వాలి పయత్నిస్తుంటాను` అని తెలిపారు బాలయ్య. మంచి మంచి దర్శకులతో పనిచేయడం తన అదృష్టమని చెప్పారు. కథలోని సోల్‌ని పట్టుకుని సినిమాలు చేస్తూ హిట్‌ కొడుతున్నట్టు చెప్పారు బాలకృష్ణ.

45
హీరోలకు బాలయ్య సలహా

ఈ సందర్భంగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి, హీరోలకు ఆయన సలహా ఇచ్చారు. సినిమాలు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. `బోయపాటి, నేను కలిస్తే మూడు నిమిషాల్లోనే పని అయిపోతుంది. లైన్‌ ఏంటనేది మాట్లాడుకుంటాం, అంతే యజ్ఞంలోకి దిగిపోతాం. అనుకున్న టైమ్‌కి పూర్తి చేస్తాం. ఇలా అనుకున్న టైమ్‌కి అందరు సినిమాలు పూర్తి చేయాలి. ఒక డెడికేషన్‌తో వర్క్ చేయాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని తెలిపారు బాలకృష్ణ. అదే సమయంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసే సినిమాలు, వాళ్లు మెచ్చే మూవీస్‌ చేయాలని తెలిపారు.

55
డిసెంబర్‌ 5న అఖండ 2 తాండవం విడుదల

`సింహ`,`లెజెండ్‌`, `అఖండ` తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం `అఖండ 2 తాండవం`. డిసెంబర్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌ గా నటిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్‌గా చేస్తుండగా, హర్షాలి తన కూతురిగా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమాని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య నుంచి వస్తోన్న ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories