
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో కింద పడబోయిన దీపను పట్టుకుంటుంది సుమిత్ర. జాగ్రత్త దీప అంటారు దశరథ, కార్తీక్ లు. సుమిత్ర పట్టుకోకపోతే టీపాయ్ మీద పడేదానివి. చూసుకోవాలి కదమ్మా అంటాడు దశరథ. ఎంత ప్రమాదం తప్పిపోయిందని అంతా అంటారు. జాగ్రత్త దీప. ఈ టైంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చూసుకొని నడవకపోతే ఎలా? అంటుంది జ్యోత్స్న. కోపంగా చూస్తుంది దీప.
పక్కకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. దీప నా కూతురే అని మా మమ్మీకి తెలియదు. సుమిత్ర నా తల్లి అని దీపకు తెలియదు. కానీ తల్లి, కూతుర్ల బంధానికి ఉన్న పవర్ గట్టిగా పనిచేస్తోంది. అందుకే మమ్మీకి ప్రమాదం జరగబోయినప్పుడు దీప కాపాడింది. దీపకు ప్రమాదం వచ్చినప్పుడు మా మమ్మీ కాపాడింది. ఇప్పుడు దీప కడుపులోని బిడ్డకు ఏం కాకుండా అమ్మమ్మే కాపాడుకుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
ఇంతలో జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వస్తాడు. నువ్వెంటి ఇక్కడికి వచ్చావు అంటుంది జ్యోత్స్న. మనం అనుకున్న పని జరిగినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది కదా జ్యోత్స్న అంటాడు కార్తీక్. నేను అనుకున్నది ఏం జరిగింది ఇప్పుడు అంటుంది జ్యోత్స్న. నువ్వు, పారు కలిసి చేయాల్సిన రచ్చ చేశారు కదా అంటాడు కార్తీక్.
ఉన్నదే కదా అన్నది. మేము తప్పు ఏం మాట్లాడలేదు కదా అంటుంది జ్యోత్స్న. ఉన్నదే అన్నారో.. లేక ఏదైనా చేయాలని అన్నారో అన్నీ తేలుస్తాను కానీ.. నాకు ఒక డౌట్ ఉంది. అది మీరే చెప్పాలి అంటాడు కార్తీక్. ఏంటది అంటుంది జ్యోత్స్న.
నా భార్య అడుగు తడబడి కింద పడబోయిందా? లేక ఎవరైనా కాలు అడ్డం పెడితే కింద పడబోయిందా? అంటాడు కార్తీక్. అది నాకెలా తెలుస్తుంది అంటూ వణికిపోతుంది జ్యోత్స్న. మీరూ అక్కడే ఉన్నారు కదా అంటాడు కార్తీక్. ఒకవేళ ఎవరైనా కావాలని కాలు అడ్డం పెడితే వాళ్లను ఎలాంటి పరిస్థితి నిలబెడతానో అస్సలు ఊహించలేరు అంటాడు కార్తీక్.
ఇది నా అనుమానం మాత్రమే. అదే నిజమని నేను నమ్మితే.. ఈపాటికి నా చేతిలో మంచి కర్ర ఉండేది. ఒక్క దెబ్బ కొడితే చాలు. తలపగిలి పోయేది అంటాడు కార్తీక్. దాసును కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. ఈ విషయం బావకు తెలుసా అని మనసులో అనుకుంటుంది. భయపడుతూనే ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నావు బావ అంటుంది జ్యోత్స్న.
నేను ఇక్కడ దీప భర్తగా మాత్రమే ఉంటున్నాను. నా భార్యకు గానీ నా బిడ్డకు గానీ ఏదైనా హాని చేయాలి అనుకుంటే కార్తీక్ ని చూస్తారు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్. నేను చాలా డేంజర్ లో ఉన్నాను. తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది జ్యోత్స్న.
మరోవైపు ఆవేశంగా కాంచన ఇంటికి వస్తాడు శ్రీధర్. కార్తీక్ ఇంట్లో లేడు అంటుంది కాంచన. నేను నీ కోసమే వచ్చాను అంటాడు శ్రీధర్. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? మిమ్నల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అంటుంది కాంచన. మనం ఇలా ఉంటే ఎవ్వరైనా అంటారు అంటాడు శ్రీధర్.
మన ఇద్దరి మధ్య ఉన్న సమస్యకు నాకు ఈ రోజు ఏదో ఒక పరిష్కారం కావాలి అంటాడు శ్రీధర్. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను కదా అంటుంది కాంచన. నేను కావేరిని వదిలేసి వస్తే నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా? అంటాడు శ్రీధర్. కావేరిని వదిలేసి రావడం ఏంటి? అయినా మీరు నన్ను వదిలేసి వెళ్లారని నేను నిన్ను మిమ్మల్ని వదిలేయలేదు. నేను వద్దు అనుకున్నాను కాబట్టి వదిలేశాను అంటుంది కాంచన.
దీనికి ముగింపు లేదా అంటాడు శ్రీధర్. కలిసి బ్రతకడం అస్సలు జరగదు అంటుంది కాంచన. మీ నాన్న, నా కొడుకు కూడా నీకంటే ఎక్కువగా నన్ను అసహ్యించుకున్నారు. కానీ వాళ్లు నన్ను క్షమించారు. నువ్వు ఆ పని చేయలేవా? అంటాడు శ్రీధర్. చేయలేను అని గట్టిగా చెప్తుంది కాంచన. సరే నేను నా కొడుకు, నీ కోడలితో కొంచెం మాట్లాడాలి. వాళ్లు వచ్చేవరకు వెయిట్ చేస్తాను అంటాడు శ్రీధర్.
పూల మొక్కలకు నీళ్లు పడుతుంటాడు కార్తీక్. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు. నేను చేసేదాన్ని కదా అంటుంది దీప. నువ్వు కొంచెం పనులు తగ్గించుకుంటే మంచిది. ఈ ఉరుకులు, పరుగులు కాస్త ఆపేయ్యాలి. నిన్ను నమ్ముకొని కడుపులో ఓ ప్రాణం ఉంది అంటాడు కార్తీక్. మాకు ఏం కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బావ అంటుంది దీప.
నేను మీ దగ్గర లేకపోతే ఎలా అంటాడు కార్తీక్. నువ్వు ఎక్కడున్నా.. నీ మనసు నా చుట్టే తిరుగుతుంది. మా బావకు నేనంటే చాలా ప్రేమ. నాకు ఎవరైనా హాని చేయాలని చూస్తే.. మాటలతోనే వాళ్లను భయపెడతాడు అంటుంది దీప. జ్యోత్స్నతో నేను మాట్లాడిన మాటలు విన్నావా అంటాడు కార్తీక్. అవును అంటుంది దీప. జ్యోత్స్న కాలు అడ్డం పెట్టింది కదా అంటాడు కార్తీక్. నేను చెప్పానా? అంటుంది దీప. ఏదేమైనా ఈ రోజు మన అదృష్టం బాగుంది అంటాడు కార్తీక్.
అవును అంటూ వాళ్ల దగ్గరికి వస్తాడు శివన్నారాయణ. దీప నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. నాకేం కాలేదు బాగానే ఉంది అంటుంది దీప. అలవాటు అయిన ఇంట్లో కూడా పడబోయావు అంటే.. దానికి ఎవరైనా కారణం అయ్యారా? అని అడుగుతాడు శివన్నారాయణ. అలాంటిది ఏం లేదు తాతగారు అంటుంది దీప. మా పని పూర్తైంది. ఇక బయల్దేరుతాం అంటాడు కార్తీక్. ఇక్కడ జరిగిన విషయాలు కాంచనతో చెప్పకండి అంటాడు శివన్నారాయణ.
కార్తీక్, దీప వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో మీరు ఇంటికి వెళ్లండి అంటుంది కాంచన. నాకు ఓపిక చాలానే ఉంది వెయిట్ చేస్తానులే అంటాడు శ్రీధర్. మీకోసం వెయిట్ చేసే వాళ్లకు అంత ఓపిక ఉండకపోవచ్చు అంటుంది కాంచన. ఇంతలో ఏవండి అనుకుంటూ కావేరి లోపలికి వస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.