ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా ? ఇంటర్నేషనల్‌ బాక్సాఫీసుని కొల్లగొట్టబోతున్న బిగ్గెస్ట్ స్టార్‌

Published : Nov 29, 2025, 07:24 AM IST

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా ? నాలుగేళ్లకి బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్ గా పాన్‌ వరల్డ్ బాక్సాఫీసుపై కన్నేశాడు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలవబోతున్నాడు. 

PREV
15
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

ఈ ఫోటోలో కనిపిస్తోన్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా? బాలనటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఊపు ఊపేశాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ప్రారంభంలో ఆయన సినిమాలు పెద్ద హిట్లు కాకపోయినా ఆ తర్వాత స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాతో బిగ్‌ బ్రేక్‌ అందుకున్నాడు. స్టార్‌ హీరో అయిపోయాడు. ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయని ఆయన ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయి సినిమాతో రాబోతున్నారు. డైరెక్ట్ గా ఇంటర్నేషల్‌ బాక్సాఫీసుని కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

25
నాలుగేళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ

ఇప్పటికే అర్థమై ఉంటుంది, అంతేకాదు ఫోటో చూస్తేనే మీకు ఆయన ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే. ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్‌ బాబు. ఆయన 1975లో జన్మించగా, 79లోనే ఆయన `నీడ` సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అన్నయ్య రమేష్‌ బాబు, నాన్న కృష్ణతో కలిసి నటించారు. ఈ సినిమాతోనే ప్రశంసలందుకున్నారు మహేష్‌. కుర్రాడు చాలా చురుకుగా ఉన్నాడు, పెద్ద హీరో అవుతాడని అప్పుడే చాలా మంది సినిమా వాళ్లు అన్నారట. ఇప్పుడు అదే జరిగింది. పెద్ద స్టార్‌ హీరోగా, సూపర్‌ స్టార్‌గా ఎదిగారు మహేష్‌. తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నారు.

35
`నీడ` సినిమా టైమ్‌లో తీసిన అరుదైన ఫోటో

పైన కనిపించిన మహేష్‌ బాబు ఆయన మూడు, నాలుగేళ్ల సమయంలో తీసిన పిక్‌. సినిమాలోకి ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతున్న సమయంలో ఈ ఫోటోని తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అరుదైన పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఘట్టమనేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో వారు ఈ పిక్‌ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 46ఏళ్ల తిరుగులేని ఆధిపత్యం అంటూ వర్ణిస్తున్నారు.

45
వారణాసితో గ్లోబల్ బాక్సాఫీసుపై కన్నేసిన మహేష్‌

ఇక ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహేష్‌ ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయలేదు. కానీ ఏకంగా ఇంటర్నేషనల్ మూవీ చేస్తూ, డైరెక్ట్ గా గ్లోబల్‌ మార్కెట్‌పై కన్నేశారు. ఈ సినిమాతో అంతర్జాతీయ బాక్సాఫీసుని కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం గట్టి ప్లానే వేశారు రాజమౌళి. ఆ దిశగానే ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

55
మైథాలజీ, టైమ్‌ ట్రావెల్‌ కథతో వారణాసి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `వారణాసి` చిత్రంలో మహేష్‌ బాబు హీరోగా నటించగా, ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. దాదాపు రూ.1300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. రామాయణం ఆధారంగా అందులోని కీలక ఘట్టాన్ని బేస్‌ చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ లోనూ ఆ విషయాన్ని స్పష్టంచేశారు. ఇందులో మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అనేక కాలాల్లోనూ ప్రయాణిస్తాడని ఈ గ్లింప్స్ లో చూపించారు. దాదాపు నాలుగైదు కాలాల్లో(టైమ్‌ ట్రావెల్‌) సినిమా సాగుతుందని చూపించారు. అది విజువల్‌గా అదిరిపోయింది. దీంతో సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఒక్క గ్లింప్స్ తోనే సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories