ఒక హీరో నుంచి మరో హీరో చేతుల్లోకి కథలు మారడం టాలీవుడ్ లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనే నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మధ్య జరిగింది. శ్రీరాములయ్య, యమజాతకుడు, ఆయుధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు ఎన్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
బాలయ్యతో పరిచయం
ఆయన దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జయం మనదేరా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా బాలకృష్ణ తో చేయాలని ఎన్.శంకర్ అనుకున్నారట. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే బాలయ్యతో పరిచయం ఉందని శంకర్ తెలిపారు. ఆ టైంలోనే ఏదైనా కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని బాలయ్య అడిగేవారు అని తెలిపారు.
35
డ్యూయెల్ రోల్ లో బాలకృష్ణ
అప్పటికే జయం మనదేరా స్టోరీ లైన్ నా మైండ్ లో ఉంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో ఆ చిత్ర కథ రాసుకున్నా. కానీ బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో కలిసి పనిచేయడం కుదరలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని రామోజీరావు గారికి ఒక కథ చెప్పాను. ఆయనకి కథ నచ్చింది. హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పాను.
వెళ్లి పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను. ఆయనకి కూడా కథ నచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు కూడా కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇంతలో సురేష్ బాబు గారు.. వెంకటేష్ కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగారు. వెంటనే బాలకృష్ణ కోసం రాసుకున్న కథనే వెంకటేష్ తో చేద్దామని అనుకున్నా. ముందుగా రాసుకున్న కథలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాలి. ఒక పాత్రలో ఫారెన్ లో ఉండే పోలీసు అధికారిగా కనిపిస్తారు. కానీ వెంకటేష్ కి పోలీస్ అధికారి లాంటి సీరియస్ పాత్ర సెట్ అవ్వదని ఆ పాత్రని టూరిస్ట్ గైడ్ గా మార్చాను.
55
వెంటనే షూటింగ్ మొదలు పెట్టమన్న రామనాయడు
ఆ తర్వాత రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ ముగ్గురికి కథ వినిపించాను. కథ అద్భుతంగా ఉంది వెంటనే షూటింగ్ మొదలు పెట్టమని రామానాయుడు గారు తెలిపారు. ఆ విధంగా జయం మనదేరా చిత్రం రూపొందినట్లు ఎన్ శంకర్ తెలిపారు. ఈ చిత్రంలో సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. 2000 సంవత్సరంలో విడుదలైన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.