మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కానీ ఫ్యాన్స్ ఎక్కువగా రికార్డులు సాధించిన చిత్రాలు గురించే చెప్పుకుంటారు. కానీ చిరంజీవిలోని అద్భుతమైన నటుడిని వెలికి తీసిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది. ఆ చిత్రం మరేదో కాదు.. పున్నమినాగు.
25
కీర్తి సురేష్ తల్లితో..
1980లో రిలీజైన ఈ మూవీలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. తన శరీరమంతా పాము విషం తో నిండిపోయి ఉంటుంది. దాని నుంచి బయటపడలేక వేదన పడుతూ చిరంజీవి నటించిన విధానం కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి, నరసింహ రాజు, మేనక, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్ మేనక ఎవరో కాదు.. ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి ఆమె.
35
రాత్రి వేళల్లో షూటింగ్
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపు 30 రోజులు రాత్రి వేళల్లోనే షూటింగ్ కి హాజరయ్యారట. అప్పటికి ఇండస్ట్రీలో చిరంజీవి పెద్దగా అనుభవం లేని నటుడు.
అయినప్పటికీ పాము లక్షణాలు ఉన్న వ్యక్తిగా, కథ మొత్తం తన భుజాలపై మోస్తూ చిరంజీవి నటించిన విధానం ఆద్యంతం కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో చిరంజీవి విశ్వరూపం ప్రదర్శించారు. చిరంజీవి ఈ చిత్రంలో కళ్ళతోనే హావభావాలు పలికించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
55
పున్నమినాగు చిత్రానికి 45 ఏళ్ళు
చిరంజీవిలోని నటనని బయటకు తీసిన పున్నమినాగు చిత్రం ఇటీవల 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనకి ప్రశంసలతో పాటు, ఆ తర్వాత హీరోగా మరిన్ని అవకాశాలు దక్కాయి.