వెండితెరతో పాటు బుల్లితెరను ఏలేస్తున్న స్టార్ హీరోలు

Published : Aug 31, 2025, 11:38 AM IST

Tollywood Heroes as TV Hosts: టాలీవుడ్‌లో హీరోలు కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా హోస్ట్‌లుగా ఆకట్టుకుంటున్నారు. తమ అభిమాన ప్రేక్షక గణానికి మరింత చేరువవుతున్నారు. ఈ స్టార్ హీరోలు టీవీ షోలు, రియాలిటీ షోల ద్వారా బుల్లితెరపై ఏలేస్తున్నారు.

PREV
17
నాగార్జున

టీవీ షోల ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో మొదటిగా గుర్తింపు తెచ్చుకున్నది కింగ్ నాగార్జున. "మీలో ఎవరు కోటీశ్వరుడు" షోతో మూడు సీజన్లపాటు ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత బిగ్ బాస్ తెలుగుకి హోస్ట్‌గా మారి, ఆడియెన్స్‌తో మరింత క్లోజ్ అయ్యారు. వరుసగా మూడవ సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగ్ హోస్ట్‌గా వ్యవహరించారు. తన హోస్టింగ్ తో షో హై టీఆర్పీతో రన్ అవుతుంది. తాజాగా 9 వ సీజన్ కు కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

27
చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లితెరపై తనదైన స్టైల్‌ను చూపించారు. 2017లో ప్రసారమైన “మీలో ఎవరు కోటీశ్వరుడు” సీజన్ 4కి హోస్ట్‌గా వ్యవహరించడం ద్వారా ఆయన టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతకుముందు ఈ షోను నాగార్జున హోస్ట్ చేయగా ఆ తరువాతి సీజన్‌కు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. 

తన హోస్టింగ్ తో చిరంజీవి బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ కారణంగానే ఆ సీజన్‌కు మంచి TRPలు రాగా, వెండితెరలో మెగాస్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో బుల్లితెరపైనా రుజువైంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా తన మ్యాజిక్ చూపించగల అరుదైన స్టార్‌గా చిరంజీవి గుర్తింపు పొందారు.

37
జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఎక్కువగా హోస్టింగ్ చేసిన యంగ్ స్టార్ హీరోల్లో ఒకరు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ (2017)కు హోస్ట్ గా చేసి, ఆ షోకు ఎనలేని ఆదరణ రావడానికి కారణమయ్యారు. 

తన స్టైల్, మాటతీరు, ఎనర్జీతో బిగ్ బాస్‌కి కొత్త హైప్ తెచ్చారు. టీవీ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీ కావడంతో టీవీ హోస్టింగ్‌కు గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టాడు తారక్.

47
నాని

నేచురల్ స్టార్ నాని కూడా బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2018లో ప్రసారమైన “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2”కి హోస్ట్ గా వ్యవహరించి తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాని చేసిన ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన ఒక్క సీజన్‌కే పరిమితమైపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలపైనే ఫోకస్ చేసి వరుస ప్రాజెక్టులతో బిజీగా మారాడు.

57
రానా

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి బుల్లితెరపై కూడా తన ప్రత్యేకతను చూపించారు. ఆయన “నెంబర్ వన్ యారీ” అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా చేశారు. ఈ షోలో సినీ సెలబ్రిటీలతో సరదాగా సంభాషిస్తూ, తన చమత్కారంతో ప్రేక్షకులను అలరించారు. 

తన ఫ్రెండ్లీ నేచర్, ఫన్ తో గెస్టులనే కాకుండా ఆడియన్స్ ను కూడా పుల్ ఎంటర్టైన్మెంట్ పంచారు. ఈ షో ఆహా, వియూ వంటి ఓటీటీలలో ప్రసారమై మంచి ఆదరణ పొందింది. రానా యాంకర్‌గా తనదైన స్టైల్‌ను చూపించి బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

67
బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తొలిసారి బుల్లితెరపైకి “అన్‌స్టాపబుల్” టాక్ షోతో ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య తన ఎనర్జీ, ఫన్, మార్క్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆహాలో ప్రసారమయ్యే ఈ షో తక్కువ కాలంలోనే నెంబర్ వన్‌గా నిలిచి, భారీ టీఆర్పీలు సాధించింది. ఇలా బాలయ్య తన క్రేజ్‌ను బుల్లితెరపై కూడా రుజువు చేసుకున్నారు.

77
జగపతిబాబు

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు కూడా బుల్లితెరలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. జీ తెలుగు లో ప్రసారమవుతున్న కొత్త టాక్ షో “జయమ్ము నిశ్చయమ్మురా”కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఆగస్టు 17న ప్రారంభమైంది. ఫస్ట్ గెస్ట్‌గా అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు వెంకట్, సోదరి నాగసుశీల పాల్గొనబోతున్నారు. జగపతి బాబు గతంలో జెమినీ టీవీలో ఓ గేమ్ షో హోస్ట్ చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతిబాబు, ఈ షోతో మరోసారి టీవీ ఆడియెన్స్‌కి దగ్గరవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories