సైఫ్ AI ఫొటోలు షేర్ చేసి ఇరుక్కున్న శతృఘ్న సిన్హా

Published : Jan 20, 2025, 06:42 AM IST

ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్‌ల AI- రూపొందించిన చిత్రాన్ని కలిగి ఉన్న పోస్ట్ విమర్శలకు దారితీసింది. ఆరోపించిన దాడి తర్వాత సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకునే ఉద్దేశ్యంతో పోస్ట్, వాస్తవ సంఘటన నుండి దృష్టిని మళ్లించింది.

PREV
16
సైఫ్ AI ఫొటోలు షేర్ చేసి ఇరుక్కున్న శతృఘ్న సిన్హా
Shatrughan Sinha, AI Photo, Saif Ali Khan, Kareena Kapoor

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని తిరిగి సెట్లోకి అడుగుపెట్టాలని చిత్రసీమతో పాటు పలు చిత్ర టీమ్ లు ఎదురుచూస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో వెటరన్ బాలీవుడ్ యాక్టర్ , పొలిటీషన్ శతృఘ్న సిన్హా చేసిన  ఓ పోస్ట్ తీవ్రంగా ట్రోలింగ్ అవుతోంది. అందుకు కారణం ఏఐ ఫొటోలు ఆయన షేర్ చేయటమే.
 

26
shatrughan sinha

బాలీవుడ్‌  ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్‌ అలీ ఖాన్‌(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. డబ్బు కోసమే ఇదంతా చేశాడని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్‌ (Bandra West) ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్‌ భవనం 12వ అంతస్తులో సైఫ్‌ సొంత ఫ్లాట్‌లోకి  తెల్లవారుజామున 2 గంటలకు ఒక దుండగుడు దూరడం ఆపై సైఫ్‌ అలీ ఖాన్‌పై విచక్షణంగా దాడి చేయడంతో ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ క్రమంలో స్పీడుగా సైఫ్ రికవరీ కావాలంటూ శతృఘ్న సిన్హా..ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తో పాటు ఏఐ జనరేట్ చేసిన సైఫ్, కరీనా కపూర్ హాస్పటిల్ లో ఉన్న ఫొటో జత చేసారు. అది ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. 

36
shatrughan sinha

శతృఘ్నసిన్హా..పోస్ట్ పెట్టిన వెంటనే నెట్ జన్లు..అది ఏఐ జనరేటెడ్ ఫొటో అని కనిపెట్టేసారు. దాంతో ఆయన్ని ట్రోల్ చేయటం మొదలెట్టారు. ఫేక్ ఫొటోలు షేర్ చేయాల్సిన అవసరం ఏముందంటూ నిలదీస్తున్నారు. తెలిసి చేసారా లేక తెలియక ఇలా చేసారా అని మరికొందరు అడుగుతున్నారు. అది మీ స్దాయికి తగిన పని కాదని మరికొందరు అంటున్నారు. ఇలా అసలు విషయం ప్రక్కకు వెళ్లి ...ఈ ఫోటో గోల ఎక్కువైంది. 

46

ఇదిలా ఉంటే సైఫ్ చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. గతేడాది ‘దేవర’తో  విలన్ గా తెలుగు తెరకు పరిచమయ్యారు సైఫ్‌ అలీఖాన్‌. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రానున్న ‘దేవర 2’తో తిరిగి రావాలని చిత్ర టీమ్  కోరుతోంది. కానీ.. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు చిత్ర టీమ్.
 

56

హెయిస్ట్‌ డ్రామా నేపథ్యంలో రాబీ గ్రూవెల్‌ రూపొందిస్తున్న ‘జ్యువెల్‌ థీఫ్‌: ది రెడ్‌ సన్‌ ఛాప్టర్‌’ లోనూ.. మార్ఫిక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ‘పఠాన్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించనున్న చిత్రంలోనూ నటించనున్నారు సైఫ్‌. అలాగే ‘భక్షక్‌’ ఫేమ్‌ దర్శకుడు పుల్కిత్‌ రూపొందించనున్న ‘కర్తవ్య’లో భాగం కానున్నారు. 

66

యాక్షన్‌ థ్రిల్లర్‌గా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ‘రేస్‌’ ఫ్రాంచైజీ చిత్రాలు. ఇందులో భాగంగా రూపొందుతున్న ‘రేస్‌ 4’లో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రమేశ్‌ తౌరానీ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పలువురు  స్టార్ దర్శకుల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

read more: సొంత రక్తంతో సోనూ సూద్ ఫొటో గీసి, కృతజ్ఞతలు

also read: సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు?
 

click me!

Recommended Stories