సొంత రక్తంతో సోనూ సూద్ ఫొటో గీసి, కృతజ్ఞతలు

Published : Jan 20, 2025, 06:29 AM ISTUpdated : Jan 20, 2025, 06:31 AM IST

భోపాల్‌కు చెందిన ఒక కళాకారుడు సూద్ యొక్క తాజా చిత్రం 'ఫతే' నుండి ప్రేరణ పొందిన తర్వాత తన స్వంత రక్తాన్ని ఉపయోగించి సోనూ సూద్ యొక్క ప్రత్యేకమైన చిత్రపటాన్ని రూపొందించాడు. కళాకారుడు, రాజ్ సైనీ, సూద్ యొక్క మానవతావాద పని మరియు నటనారంగానికి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.

PREV
16
సొంత రక్తంతో సోనూ సూద్ ఫొటో గీసి, కృతజ్ఞతలు
Blood Portrait , Sonu Sood, Fateh

ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ గా చేసిన సోనూసూద్... కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్‌ హీరో అయ్యారు. ఆయన్ను దేశం మొత్తం కీర్తించింది. ఏదైనా అత్యవసరం అంటే సోనూసూద్ (Sonu Sood)అనే స్దాయిలో ఆయన సేవలు కొనసాగాయి. ఆయన అభిమానులు అంతటా ఉన్నారు.

ఆయనపై ఉన్న అభిమానంతో సోషల్ మీడియోలో పోస్ట్ లు పెడుతూంటారు. వచ్చి ఆయన్ను కలుస్తూంటారు. అదే విధంగా భూపాల్ కు చెందిన  ప్రముఖ కళాకారుడు రాజ్ సైనీ తన అభిమానాన్ని మరో విధంగా వ్యక్తం చేసారు.

26

 రాజ్ సైనీ, తన స్వంత రక్తాన్ని ఉపయోగించి, నటుడు  సోనూ సూద్  చిత్రాన్ని చిత్తరీకరించారు. సోనూసూద్ హీరోగా నటించిన  చిత్రం 'ఫతే' చూసి ఆ బ్లడ్ పొట్రాయిట్ గీయటం జరిగింది.  సైనీ మాట్లాడుతూ, తాను రీసెంట్ గా ‘ఫతే’ని చూశానని ,.సోనూసూద్  దర్శకత్వ అరంగేట్రం తనను ఆకట్టుకున్నాయన, ఆయన్ని నటుడుగా కన్నా మానవతా వాదిగా గుర్తు పెట్టుకుంటానని, ఆ నటుడికి నివాళిగా 2 అడుగుల పొడవైన చిత్రపటాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకోసమే ఇలా చేసాను అన్నారు.
 

36

రాజ్ సైనీ మాట్లాడుతూ... “నిజానికి సూద్ సమాజానికి రక్షకుడు. నేను పక్షవాతం బారిన పడిన తర్వాత   అతను నాకు సహాయం చేశాడు, ”అని సైనీ చెప్పారు. "ఈ విధంగా అతని పట్ల నా మనోభావాలను వ్యక్తపరచడం నా బాధ్యత."  సొంత రక్తాన్ని ఉపయోగించి చిత్రపటాన్ని రూపొందించడం ద్వారా సూద్ పట్ల తన అంకితభావాన్ని వ్యక్తం చేసిన దేశంలోనే మొదటి వ్యక్తి తానేనని ఆ చిత్రకారుడు పేర్కొన్నాడు.

46

  "నేను ఆదివారం నా స్వంత రక్తాన్ని ఉపయోగించి అతని చిత్రాన్ని రూపొందించాను. పోర్ట్రెయిట్‌ని పూర్తి చేయడానికి రెండు గంటల సమయం పట్టింది’’ అని, ‘‘పెయింటింగ్‌ని ఫ్రేమ్‌ చేసి ముంబైకి పంపిస్తామన్నారు. సినీనటుడు సమాజానికి ఎంతో చేశాడని సైనీ అన్నారు.
 

56

ఇక రియల్ హీరో సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫతే’(Fateh). ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా సోనూ సూద్ వ్యవహరించాడు. జీ స్టూడియోస్ నిర్మించింది. ఈ మూవీ శుక్రవారం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించింది. 

ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఫతే మూవీ రూ.2.45 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్లు రూ.70 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. దీనితో రూ.2.45 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టి ఆశ్చర్యపరిచింది.  

66

ఫతే విడుదలకు ముందు, మేకర్స్ ఆడియన్స్ కోసం స్పెషల్ ఆఫర్‌నుతీసుకొచ్చారు. టిక్కెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. ఇకపోతే, రు.15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు అందుకోనుందో చూడాలి.  

సైబర్ క్రైమ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వచ్చిన ఈ  సినిమా రియాల్టీకి దగ్గరగా ఉంది. లాక్‌‌డౌన్ టైమ్‌‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా దీన్ని  రూపొందించారు. సోనూతో పాటు, ఫతేలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్ మరియు నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు.

read more:`ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్‌కి గట్టి దెబ్బ?

also read: బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే: సల్మాన్‌ కి షాకిచ్చిన అక్షయ్‌ కుమార్‌, షూటింగ్‌ లో పాల్గొనకుండానే జంప్‌

 

click me!

Recommended Stories