Balakrishna: చిరంజీవి, మోహన్ బాబు కొట్టుకుంటుంటే ఆయన నా కోసమే ఉన్నారు.. ఆ సంఘటనలో నిజాలు బయటపెట్టిన బాలకృష్ణ

Published : Dec 27, 2025, 11:11 AM IST

Nandamuri Balakrishna: చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాల గురించి నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వజ్రోత్సవ వేడుకల్లో ఆ వివాదం ఎందుకు జరిగిందో బాలయ్య వివరించారు. 

PREV
15
చిరంజీవి, మోహన్ బాబు విభేదాలు 

నందమూరి బాలకృష్ణ ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా ఓపెన్ గా తన మనసులో విషయాలు బయటపెట్టేస్తారు. వివాదాలని సైతం బాలయ్య పట్టించుకోరు. తన దారిలో తాను వెళతారు. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదలై థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ దశాబ్దాలుగా ఉంది. అదే విధంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. 

25
చిరంజీవిపై మోహన్ బాబు కామెంట్స్ 

2007లో తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆ టైంలో జరిగిన సంఘటనల గురించి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీనియారిటీ, లెజెండ్ అనే గుర్తింపు విషయంలో మోహన్ బాబు మనస్తాపానికి గురయ్యారు. స్టేజిపైనే చిరంజీవిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

35
బాలకృష్ణ కామెంట్స్ 

ఆ తర్వాత మోహన్ బాబుకి చిరంజీవి కౌంటర్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీని గురించి బాలయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ లెజెండ్ అనే హోదా కోసం కొట్టుకుంటున్నారు. ఆ ఈవెంట్ కి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ గొడవ చూసి ఆయన.. ఇది ఇప్పట్లో తేలేలా లేదు మనకి చాలా పనులు ఉన్నాయి వెళ్ళిపోదాం పద అని పీఏ తో అన్నారు. 

45
నా కోసం రాజశేఖర్ రెడ్డి ఎదురుచూశారు 

అప్పుడు రాజశేఖర్ రెడ్డి పీఏ.. సార్ మనం ఒక్కరిని సన్మానించి వెళ్ళాలి సార్ అని అడిగారు. ఎవరిని అని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నందమూరి బాలకృష్ణ గారిని అని పీఏ చెప్పాడు. బాలకృష్ణనా.. పెద్ద ఎన్టీఆర్ గారి అబ్బాయి.. అయితే తప్పనిసరిగా మనం సన్మానించే వెళ్ళాలి అని అన్నారు. అలా రాజశేఖర్ రెడ్డి నా కోసం ఎదురుచూసి నన్ను సన్మానించి వెళ్లారు అని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. 

55
బాలయ్యకి అభిమాని 

అది రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం. నాన్నగారికి అభిమానులు కానివారు ఎవరు అని బాలయ్య అన్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నందమూరి బాలకృష్ణ అభిమాని అని చెబుతుంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories