ఊరమాస్‌ కాంబోని సెట్‌ చేసిన బాలకృష్ణ.. ఈసారి బోయపాటి సినిమాని మించి !

Published : Jan 16, 2025, 08:10 AM IST

బాలకృష్ణ `డాకు మహారాజ్‌`తో మంచి జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. నెక్ట్స్ మరో ఊర మాస్ కాంబినేషన్‌ని సెట్‌ చేస్తున్నారు.   

PREV
15
ఊరమాస్‌ కాంబోని సెట్‌ చేసిన బాలకృష్ణ.. ఈసారి బోయపాటి సినిమాని మించి !

టాలీవుడ్‌లో మాస్‌కి, ఊరమాస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు బాలకృష్ణ. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` సక్సెస్‌ తో తానేంటో చూపించారు. తనలోని మాస్‌ ఏంటో చూపించాడు బాలయ్య. ఇప్పుడు మాస్‌ మొగుడు బోయపాటితో సినిమా చేస్తున్నారు. `అఖండ` కి సీక్వెల్‌గా `అఖండ 2` తెరకెక్కుతుంది.

ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ తత్వం, ప్రకృతి అంశాలను బేస్ట్ చేసుకుని బోయపాటి ఈ మూవీ రూపొందిస్తున్నారట. `అఖండ`ని మించి ఉండబోతుందని, బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్ అంటున్నారు. 
 

25

ఇదిలా ఉంటే బాలయ్య మరో సినిమాని లైన్‌లో పెట్టారు. బాలయ్యని ఊరమాస్‌గా చూపించడంలో బోయపాటినే మేటి అని భావిస్తున్న నేపథ్యంలో దాన్ని మించి చూపించారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. `వీరసింహారెడ్డి`లో ఆయన ఏ రేంజ్‌లో చూపించారో మనకు తెలిసిందే. బాలయ్య వరుస బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ కాబోతుందట. బాలకృష్ణ నెక్ట్స్ గోపీచంద్‌ మలినేనితో సినిమా చేయబోతున్నారట. 

35

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న `అఖండ 2ః తాండవం` అయిపోయిన తర్వాత గోపీచంద్‌ మలినేని మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్‌ 10న ప్రారంభం కాబోతుందని సమాచారం. బాలకృష్ణ పుట్టిన రోజున స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య నెక్ట్స్ చేయాల్సిన దర్శకుల లిస్ట్ పెద్దగా లేదు, రకరకాల రూమర్లు వచ్చాయి తప్ప బేస్ గా ఇది అని చెప్పే ప్రాజెక్ట్ ఇంకా ఏదీ రాలేదు. అనిల్‌ రావిపూడితో అన్నారు. ఆయన ఇప్పుడు చిరంజీవితో చేయబోతున్నారు. చూడబోతుంటే బాలయ్య, గోపీచంద్‌ మలినేని కాంబోనే రిపీట్‌ కాబోతుందని తెలుస్తుంది. 

45

ఇక గోపీచంద్‌ మలినేని `వీరసింహారెడ్డి` తర్వాత రవితేజతో అనుకున్నారు. కానీ బడ్జెట్‌ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని క్యాన్సిల్‌ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ, సన్నీ డియోల్‌ తో మరో ఊరమాస్‌ మూవీ చేస్తున్నారు గోపీచంద్‌. `జాట్‌` పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ అనంతరం బాలయ్య ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
read more: దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్‌ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?

55

ఇక బాలకృష్ణ ఇలా వరుసగా విజయాలు సాధించడం వెనక ఓ లేడీ ఉందట. యంగ్‌ డైరెక్టర్లతో సినిమాలు చేసేలా ఆమె ప్లాన్‌ చేస్తున్నారట. ఆమె సలహాలతోనే బాలయ్య తనని తాను మార్చుకుని మూవీస్‌ చేస్తున్నాడట. ఆమె ఎవరో కాదు ఆయన చిన్న కూతురు తేజస్విని. `అన్‌ స్టాపబుల్‌` షో నుంచి, ఆ తర్వాత వచ్చిన సినిమాల వెనుక ఆమె ప్రమేయం ఉందని సమాచారం.

ఇటీవల బాలయ్య మాట్లాడుతూ, `అఖండ 2` తర్వాత మరో బాలయ్యని చూస్తారని, తనకు ఇది సెకండ్‌ ఇన్నింగ్స్ అని ఇటీవల `డాకు మహారాజ్‌` ఈవెంట్లో చెప్పిన విషయం తెలిసిందే. ఆ దిశగానే కూతురు సపోర్ట్ తో ముందుకు సాగుతున్నారు బాలయ్య. 

read more:పవన్‌ కళ్యాణ్‌ కి ఫస్ట్ టైమ్‌ చిరంజీవి వార్నింగ్‌, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు

also read: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్‌ హీరోల్లో బాలయ్య రేర్‌ ఫీట్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories