సంక్రాంతి పండుగంటే రైతులదే కాదు, సినిమా అభిమానులదే అనేంతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తెలుగు,తమిళ రాష్ట్రాల్లో కనపడుతూ వస్తోంది. ఈ సంక్రాంతి కూడా సినిమాలతో హంగామా గట్టిగా చేసింది. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో థియేటర్స్ పండగ చేసుకున్నాయి.
కలెక్షన్స్ వర్షం కురిసింది. సినిమా ఓ మాదిరిగా ఉన్నా సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేయచ్చు. ఈ విషయం తెలిసిన దర్శకు,నిర్మాతలు సంక్రాంతికే టార్గెట్ చేస్తూంటారు. ఆ క్రమంలో గత పదేళ్లుగా సంక్రాంతికి వచ్చి విన్ అయిన సినిమాలు లిస్ట్ చూద్దాం.
గత పదేళ్లుగా సంక్రాంతికు విన్ అయిన సినిమాలు (2016- 2025) లిస్ట్ చూస్తే
1. సోగ్గాడే చిన్ని నాయినా- 2016
సోగ్గాడే చిన్నినాయనా నాగార్జున హీరో గా నటించగా 2016 సంక్రాంతికి విడుదలైన చిత్రం. కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది
2.ఖైధీ నెంబర్ 150 - 2017
చిరంజీవి, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించింది. తమిళ రమణ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సినిమా రీ ఎంట్రి చిత్రం ఇది.
3. జై సింహా -2018
తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది, సంక్రాంతికి విడుదల అయిన బాలయ్య సినిమా ‘జై సింహా’.ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ రేంజ్ లోనే సినిమాను పూర్తి చేశారు. నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకున్నారు. తక్కువ రేట్లతో వచ్చన ఈ సినిమా మార్కెట్లో బాగానే సొమ్ము చేసుకుంది. టాక్ యావరేజ్ గా ఉన్నా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిపోయింది.
4.ఎఫ్ 2- 2019
'ఎఫ్ 2'.. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, గద్దె రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రధారులు.
5.అల వైకుంఠపురములో -2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠరములో.బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో టబు, సుశాంత్, జయరామ్, నివేదా పేతురాజ్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్‌లు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ సత్తా చాటింది.
6. క్రాక్ -2021
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించారు. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రవితేజ, శ్రుతీ హాసన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి హిట్ అవసరం అని అనుకుంటున్న సమయంలో దక్కిన విజయమిది. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శంకర్ అనే పాత్రను పోషించారు.
7. బంగార్రాజు- 2022
'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన 'బంగార్రాజు' మూవీ తెలుగు తెరపై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడం, పోటీలో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి.
8.వాల్తేరు వీరయ్య -2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు చిరంజీవి సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వాల్తేరు వీరయ్య. 200 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
9. హనుమాన్ -2024
2024 సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది. ఇక ఈ సినిమాలో క్యాస్ట్ చిన్నగా ఉన్నా.. సినిమా పెద్ద హిట్ అయ్యి ఊహించని స్దాయిలో కలెక్షన్స్ తెచ్చి పెట్టింది.