మెగాస్టార్ చిరంజీవి బయట చాలా ఫన్నీగా ఉంటారు. ఈవెంట్లలోనూ సరదాగా నవ్విస్తుంటారు. జోవియల్‌గా కనిపిస్తారు. మరి ఇంట్లో ఎలా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతోనూ అలానే ఉంటాడా? అంటేకాదు అంటున్నాడు రామ్ చరణ్. ఇంట్లో నాన్నగారు చాలా సీరియస్‌గా ఉంటారని, చాలా తక్కువగా మాట్లాడతారని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకటిరెండుసార్లు ఆయన సీరియస్ అయినట్టు, బెల్ట్ తో కొట్టినట్టు కూడా చెప్పారు.
మరి పవన్ కళ్యాణ్‌పై ఎప్పుడైనా కోప్పడా అంటే ఓ సారి తాను చిరంజీవి అన్నయ్య కోపాన్ని చూసినట్టు తెలిపారు పవన్. బెసిక్‌గా ఎప్పుడూ కోప్పడు అని, అంతా కూల్ చెబుతారు అని వెల్లడించారు. కానీ ఓ సందర్భంలో మాత్రం ఆయనలో కాస్త కోపం చూశాను అని, ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను, ఆ రోజు నుంచి తనలో చాలా మార్పు వచ్చిందన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఇప్పుడు హీరోగా, డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోగా కాకముందు పెద్దగా పనీ పాట లేకుండానే తిరిగేవాడట. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, పుస్తకాలు చదవడం చేసేవాడట. చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇంట్లో మాత్రం అన్నీ సాగించుకునేవాడట. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మారాం చేసేవాడట.
నాన్ వెజ్ లేనిదే ముద్దదిగేది కాదట. ఏరోజైనా నాన్ వెజ్ వండకపోతే ఇట్లో గోల చేసేవాడట. అప్పట్లో చిరంజీవి చాలా బిజీగా ఉండేవాడు. హీరోగా సక్సెస్ అయిన నేపథ్యంలో రెండు మూడు షిఫ్ట్ ల్లోనూ సినిమాలు చేసేవారు. అర్థరాత్రి ఎప్పుడో వచ్చేవారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఈ విషయం చిరంజీవికి తెలిసింది. ఓ రోజు ఇలానే తన ముందే అమ్మపై అరిచాడట పవన్.
దీంతో ఆయన్ని దగ్గరికి పిలిపించి.. ఒక్కసారి బయటకు వెళ్లి చూడు, మనం ఈ మాత్రం అయినా ఫుడ్ తింటున్నాం, మనకు దొరుకుతుంది, బయటకు చాలా మంది కనీసం ఒక్క పూట కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఉన్నదాన్ని సర్దుకుని పోవాలి, ఇలా బెట్టు చేస్తే బాగోదు అని కూల్‌గానే స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడట. ఇలాంటిది చేయోద్దని చెప్పాడట.
చిరంజీవి అన్నయ్యని పవన్ ఇలా ఎప్పుడూ చూడలేదు, కూల్‌గా చెప్పినా, గట్టిగానే చెప్పాడు. అంతే ఆ దెబ్బతో ఇంకెప్పుడు తాను అలాంటి పని చేయలేదని, ఆ టైమ్‌కి ఏది ఉంటే అది తినేఅలవాటు చేసుకున్నానని, అన్నయ్య చెప్పిన ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అని ఓ పాత ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు.