ఇంట్లోనే టార్చర్‌ అనుభవిస్తున్న బాలయ్య హీరోయిన్‌.. సాయం చేయాలంటూ కన్నీరు మున్నీరు

Published : Jul 23, 2025, 11:16 AM IST

బాలీవుడ్‌ నటి తను శ్రీ దత్తా వీడియో వైరల్‌ అవుతుంది. తనని ఇంట్లో వేధిస్తున్నారని, ఎవరైనా సహాయం చేయాలని ఆమె వేడుకుంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. 

PREV
15
ఇంట్లోనే వేధిస్తున్నారంటూ తను శ్రీ దత్తా ఆవేదన

ఒకప్పుడు `మీటూ` ఉద్యమానికి తెరలేపి సంచలనం సృష్టించింది హీరోయిన్‌ తనుశ్రీ దత్తా. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతుంది. 

తనని ఇంట్లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్‌ ఎవరైనా సాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె తన బాధలు చెబుతూ కన్నీరు మున్నీరయ్యింది. ఆరేళ్లుగా ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తెలిపింది.

25
హెల్ప్ చేయాలంటూ తను శ్రీదత్తా వీడియో షేర్‌

ఇందులో తను శ్రీ దత్తా చెబుతూ, `నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏమీ మాట్లాడలేకపోతున్నా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. పోలీసులకు ఫోన్ చేశాను, వారు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు.

 బహుశా రేపో ఎల్లుండో పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. భద్రత లేకుండా పోయింది. పనిమనిషిని కూడా పెట్టుకోలేకపోయాను. గతంలో వచ్చిన పనివాళ్లు వస్తువులు దొంగిలించారు. అంతా తనే చూసుకోవాల్సి వస్తోంది` అని తెలిపింది.

35
రాత్రిళ్లు ప్రశాంతత లేదని తనుశ్రీ దత్తా కన్నీరు మున్నీరు

మరో వీడియోలో రాత్రివేళ్లలో తన ఇంటి బయట వినిపించే శబ్దాలను రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. ఈ శబ్దాలు తనని భయాందోళనకు గురిచేస్తున్నాయని, నిద్రలేక, ప్రశాంతత లేక మానసికంగా విసిగిపోయానని, ఇది కూడా వేధింపుల భాగమేనని తను శ్రీ వెల్లడించింది. 

ఎవరైనా తనకు హెల్ప్ చేయాలని వేడుకుంది. ప్రస్తుతం ఆమె వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే ఆ తర్వాత మాత్రం తాను మామూలుగా ఉన్న వీడియోలు, ఫోటోలు పంచుకోవడం గమనార్హం. 

45
`మీటూ` మూమెంట్‌తో తను శ్రీ దత్తా సంచలనం

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన తను శ్రీ దత్త మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. 

అయితే 2018లో `మీటూ` ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‪‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ `మీటూ` మూమెంట్‌ సౌత్‌కి కూడా విస్తరించింది. 

ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు ముందుకు వచ్చి తాము కూడా వేధింపులకు గురైనట్టు వెల్లడించారు. ఆ వివాదం ఇప్పటికీ అడపాడపా వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇలా తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తను శ్రీ దత్తా చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది.

55
తెలుగులో బాలయ్య సరసన `వీరభద్ర`లో నటించిన తను శ్రీ దత్తా

తను శ్రీ దత్తా ఒక తెలుగు సినిమా కూడా చేసింది. బాలయ్య సరసన `వీరభద్ర` చిత్రంలో నటించింది. 2006లో ఈ మూవీ విడుదలైంది. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. 

ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు తను శ్రీ దత్తా. 2010 వరకు యాక్టివ్‌గా సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories