మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే మిగిలి ఉంది. హను మాన్ మూవీతో పాన్ ఇండియాని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ ను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మోక్షీ కోసం బాలయ్యకి ఒక స్టోరీ లైన్ చెప్పారట. ఇది బాలయ్యకు బాగా నచ్చిందట. తన కొడుక్కి కరెక్ట్ గా సూట్ అవుతుందని బాలయ్య అనుకున్నారట. దాంతో దాదాపు ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటున్నారు.
అంతే కాదు తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను కూడా బాలయ్య సెట్ చేసి పెట్టాడట. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న శ్రీలీల. బాలయ్య బాబుతో శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో నటించింది. దాంతో శ్రీలీలలో టాలెంట్ ను గుర్తించిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని అనుకున్నారట.
గతంలో బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న స్నేహంతో ఆమెను కూడా అడిగాడట బాలయ్య. ఆయన అడగడంతో ఆమె వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు ఇంకా అఫీషియల్ గా బయటకురాలేదు. కాని ఇండస్ట్రీ నుంచి గుసగుసలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీతో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ -అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. కాని వారి మధ్య కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య కూదా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలో ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య.. ఇండస్ట్రీలో సఖ్యత ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చూడాలి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోందో.