బిగ్ బాస్ 8లో వేణు స్వామి.. దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, చరిత్రలో ఇదే మొదటిసారి!

Published : Jul 04, 2024, 11:09 AM ISTUpdated : Jul 21, 2024, 11:31 AM IST

బిగ్ బాస్ లవర్స్ కి ఇది భారీ సర్ప్రైజ్. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నారట. మరో సంచలనం ఏమిటంటే... బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ కంటెస్టెంట్ కి ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇస్తున్నారట...   

PREV
17
బిగ్ బాస్ 8లో వేణు స్వామి.. దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, చరిత్రలో ఇదే మొదటిసారి!


తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి అంటే తెలియని వారుండరేమో బహుశా. అంతగా ఆయన పాప్యులర్ అయ్యారు. జ్యోతిష్యుడిగా వేణు స్వామికి చాలా పేరుంది. టాలీవుడ్ ప్రముఖ నటులు, హీరోయిన్స్, వ్యాపారవేత్తలు ఆయన కష్టమర్స్. లక్షలు చెల్లించి ప్రత్యేక పూజలు చేయిస్తారు. వేణు స్వామి చేత పూజలు నిర్వహిస్తే వృత్తి, వ్యాపారాల్లో జయమే అని గట్టిగా నమ్ముతారు. 

27


వేణు స్వామిని యూట్యూబ్ ఛానల్స్ పాప్యులర్ చేశాయి. ఆయన సమకాలీన రాజకీయ నాయకులు , సినిమా స్టార్స్ జాతకాలు ఓపెన్ గా చెబుతాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ భవిష్యత్ అంచనా వేస్తాడు. వాళ్ళు కలకాలం కలిసి ఉంటారో? విడాకులు తీసుకుని విడిపోతారో? ముందుగానే చెబుతాడు. 

37

ఈ క్రమంలో వేణు స్వామి కామెంట్స్ పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అభిమానులను హర్ట్ చేశాయి. సలార్ ప్లాప్ అవుతుందని వేణు స్వామి అన్నారు. అలాగే ప్రభాస్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాడని నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దాంతో వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. 

47

ఎవరు ఎంతగా ట్రోల్ చేసినా నేను తగ్గను. ఎవరి మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఉండదు. జాతకం ఆధారంగా భవిష్యత్ చెబుతాను అంతే. ఇది నచ్చని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తుంటారని వేణు స్వామి సమర్థించుకుంటారు. అయితే ఇటీవల వేణు స్వామి జ్యోతిష్యం ఘోరంగా విఫలం చెందింది. వేణు స్వామి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పిన కేసీఆర్, వైఎస్ జగన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయారు. దాంతో వేణు స్వామి క్షమాపణలు చెప్పారు. 

57
Venu Swamy

ఇదిలా ఉంటే వేణు స్వామి బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొంటున్నాడంటూ ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది. వేణు స్వామి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. అతనికి విపరీతమైన పాపులారిటీ ఉంది. కాబట్టి వేణు స్వామి కంటెస్టెంట్ గా ఉంటే మంచి టీఆర్పీ రాబట్టవచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో వేణు స్వామిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం.

67


అయితే వేణు స్వామి భారీగా డిమాండ్ చేశారట. తన రోజువారీ సంపాదన లెక్కలు చెప్పిన వేణు స్వామి అంతకు మించి ఇస్తేనే హౌస్లో అడుగుపెడతానని అన్నారట. మొదట సంశయించిన మేకర్స్... తర్వాత తెగించి ఓకే అన్నారట. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరికీ ఇవ్వనంత రెమ్యూనరేషన్ వేణు స్వామికి ఇస్తున్నారట. ఎంత అనేది తెలియాల్సి ఉంది. 

77
Venu Swami

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ చర్చగా గట్టిగా నడుస్తుంది. వేణు స్వామితో పాటు బర్రెలక్క, కుమారి ఆంటీ, బుల్లెట్ భాస్కర్, సురేఖావాణి, హేమ, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, కిరాక్ ఆర్పీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే లాంచింగ్ ఎపిసోడ్ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories