మోక్షజ్ఞ ఎంట్రీ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్‌, ఏ పాత్రలో కనిపిస్తున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే ?

First Published | Oct 29, 2024, 4:02 PM IST

బాలయ్య తన నట వారసుడుని పరిచయం చేయబోతున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య గెస్ట్ రోల్‌ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 
 

Mokshagna Nandamuri

నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ. బాలకృష్ణ నటన వారసుడిగా ఆయన సినిమాల్లోకి రాబోతున్నారు. హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్‌ అయ్యింది. `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతుంది. అంతేకాదు ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందబోతుంది. మైథలాజికల్‌ టచ్‌ ఇస్తూనే సోషల్‌ ఎలిమెంట్లు ఉంటాయని తెలుస్తుంది. ఇందులో మోక్షజ్ఞ పాత్ర రెండు రకాల షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రశాంత్‌  వర్మ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉన్నారు. ఓ వైపు `హనుమాన్‌`కి సీక్వెల్‌ `జై హానుమాన్‌` తెరకెక్కించబోతున్నారు. అలాగే తన ప్రొడక్షన్‌లో మరో సినిమా ఉంటుంది. దీంతోపాటు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సినిమా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఏది ముందు ప్రారంభమవుతుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 
 


ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ వార్త లీక్‌ అయ్యింది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో ఓ గెస్ట్ రోల్‌ ఉండబోతుందట. అయితే ఆ పాత్రలో ఏకంగా బాలయ్య కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో బాలయ్య కృష్ణుడి పాత్రలో కనిపిస్తారనేది తెలుస్తుంది. గతంలో బాలయ్య రాముడిగా, అభిమన్యుడుగా, కృష్ణుడిగా, అర్జునుడిగానూ నటించారు. ఇప్పుడు మరోసారి కృష్ణుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. బాలయ్య రోల్‌ క్లైమాక్స్ లో వస్తుందని, ఆయన ఎంట్రీతో సినిమా వేరే లెవల్‌కి వెళ్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది  నిజమే అయితే మాత్రం సినిమా రేంజ్‌ ని ఊహించడం కష్టమే. 

అయితే ఈ మూవీని పాన్‌ ఇండియాగా ప్లాన్‌ చేస్తున్నారు. సుమారు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట. బాలయ్య తన వారసుడిని గ్రాండ్‌గా లాంఛ్‌ చేయాలని భావిస్తున్నారట. అందుకే బడ్జెట్‌ విషయంలో రాజీపడకుండా చూసుకుంటున్నారట. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నారట. వైజాగ్‌ సత్యానంద్‌ వద్ద ట్రైనింగ్‌ అవుతున్నారట. గతంలో లావుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు బాగా తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఇందులో స్లిమ్‌గా కనిపిస్తున్నారు మోక్షజ్ఞ. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. భారీ కటౌట్‌లా కనిపిస్తున్నారు. తమ్ముడు హీరోగా పరిచయం అవుతుండని చెప్పి ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ లు సైతం తమ అభినందనలు తెలియజేశారు. 

ఇదిలా ఉంటే బాలయ్య.. మోక్షజ్ఞ తేజని `ఆదిత్య 999`తో లాంఛ్‌ చేయాలనుకున్నారు. తానే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. అంతేకాదు తానే దర్శకత్వం వహించాలనుకున్నారట. కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఈ లోపు ప్రశాంత్‌ వర్మ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట. ఇది మోక్షజ్ఞ కెరీర్‌గా ది బెస్ట్ ఉండబోతుందని, పర్‌ఫెక్ట్ ఎంట్రీ మూవీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే హీరోయిన్‌ రవీనా టండన్‌ కూతురు రాశి థడాని హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ సినిమాని డిసెంబర్‌ 2న ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాతో అక్క తేజస్విని నిర్మాతగా మారుతుండటం విశేషం. 

read more: వజ్రోత్సవాల్లో చిరంజీవికి అంత అవమానం జరిగిందా? ఆ విషయం గుర్తు చేసుకుంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌

also read: సీనియర్‌ ఎన్టీఆర్‌, జూ ఎన్టీఆర్‌లో ఉన్న కామన్‌ టేస్ట్ ఏంటో తెలుసా? నందమూరి హీరోల్లో ఎవరూ అలా చేయరు!
 

Latest Videos

click me!