మహేష్ కు 1000 కోట్లు, అల్లు అర్జున్ కు 500 కోట్లు

First Published | Oct 29, 2024, 3:29 PM IST

 అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. జనవరిలో ఓ స్పెషల్ గ్లింప్స్ తో సినిమాని ప్రకటిస్తాము. 

Trivikram, Allu arjun, Rajamouli, Mahesh babu

ఇప్పుడు తెలుగు సినిమా హీరోల బడ్జెట్ వందల కోట్లలో నడుస్తోంది. ఎవరికి వాళ్లు తగ్గేదేలే అన్నట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు.  క్రేజీ కాంబినేషన్స్, ప్యాన్ ఇండియా సబ్జెక్టులు తెలుగు సినిమాలను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తున్నాయి. అలాగే హీరోలు సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ లేకపోతే, అలాంటి కంటెంట్ కాకపోతే అసలు సినిమా చేయటానికి ఆసక్తి చూపటం లేదు. ఆ క్రమంలో ఇప్పుడు మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవి, త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీలు ప్రారంభానికి రెడీ గా ఉన్నాయి. 
 

Trivikram, Allu arjun, Rajamouli, Mahesh babu


అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. నిన్నే పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసారు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది పలువురి పేర్లు వినిపిస్తున్నా మొదట త్రివిక్రమ్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

పుష్ప 2 సినిమా అయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు అని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల  నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అని అంచనాలు పెంచారు.


Trivikram, Allu arjun, Rajamouli, Mahesh babu


తాజాగా  ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. జనవరిలో ఓ స్పెషల్ గ్లింప్స్ తో సినిమాని ప్రకటిస్తాము. మార్చ్ నుంచి మూవీ షూటింగ్ మొదలుకానుంది. అల్లు అర్జున్ కూడా మార్చ్ లోనే ఆ సినిమా షూట్ లో పాల్గొంటారు.

ఇప్పటివరకు రాజమౌళి రకరకాల జానర్ లో సినిమాలు చేసారు. రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నాం అని తెలిపారు. ఇప్పుడా ఆ చిత్రం బడ్జెట్ 500 కోట్లు అని బయిటకు వచ్చింది.

Trivikram, Allu arjun, Rajamouli, Mahesh babu


ఇక ఇప్పటికే సినిమా ప్రారంభం కాకుండానే మహేశ్‌ బాబు- రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  ఈ ప్రాజెక్ట్‌ను డైరక్ట్ చేస్తున్నది దర్శకదీరుడు రాజమౌళి కావడంతో ఎంతటి అంచనాలు పెట్టుకున్నా అంతే స్థాయిలో సినిమాను తెరకెక్కాస్తాడు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో మహేశ్‌ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే  ప్రకటించారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభించనున్నాడు జక్కన్న.

Rajamouli, mahesh babu,AI


  ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఉన్నారనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్‌ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం రాజమౌళి, మహేశ్‌ మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాట‌కి కట్టుబ‌డి ఉన్నారు. కానీ అడ్వేంచర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్‌ అవుతుంది. సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 
 


మహేష్ బాబుకి పారితోషికంతో పాటు “లాభాల్లో కొంత వాటా” ఇచ్చేందుకు అంగీకరించారట. ఇక రాజమౌళి కూడా పారితోషికంతో పాటు భారీ మొత్తంలో లాభాల్లో వాటా తీసుకుంటారు. ఈ సినిమా నిర్మాణానికి, గ్రాఫిక్స్ కి పెట్టె ఖర్చు కూడా అధికంగా ఉంటుంది.

దీంతో  ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క  MMSB 29 కోసం ఎన్ని వందల కోట్లు అయినా పెట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపిందట. కానీ ఈ ప్రాజెక్ట్‌ గురించి అన్ని విషయాలు రాజమౌళి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

సినిమాసినిమాకు మహేష్ బాబు లుక్స్ మారిపోతున్నాయి. కాగా ప్రస్తుతం హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాంగ్ హెయిర్.. మీడియం గెడ్డంతో.. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. త్వరతో ఈమూవీ ఓపెనింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.  ఈసినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈసినిమ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.  

Latest Videos

click me!