నాకు కళ్ళు తిరుగుతున్నాయి , కార్వాన్ ఇవ్వండి అన్నాడు ప్రభాస్, అప్పుడు అర్దమైంది మాకు

First Published | Oct 29, 2024, 3:30 PM IST

ఈ సినిమా సెకండ్  పార్ట్ షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంట్రడక్షన్ ..రథం లాగుతూ రావాలి. అది సహజంగా కనిపించేలా ఊపిరి బిగపట్టి లాగాలి. 

Prabhas, rajamouli, baahubali,anushka


ప్రభాస్ ఈ రోజున ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఉత్తినే ఆ స్దాయి రాలేదు. ఆయన ప్రతీ సినిమాలోనూ, షాట్ లోనూ తన కష్టం కనిపిస్తుంది. ఎక్కడా రిలాక్స్ కాకుండా సినిమా కమిటైతే రాత్రింబవళ్లూ కష్టపడతారు. కేవలం కటౌట్ ఉంది క్లిక్ అయ్యిపోలేదు ప్రభాస్. తన కష్టాన్ని నమ్ముకునే ముందుకు వెళ్లారు.

షూటింగ్ సమయంలో ఆయన డూప్ లేకుండా  చేసే సాహసాలు ఒక్కోసారి డైరక్టర్స్ కు చెమటలు పట్టిస్తూంటాయి. అలాంటి ఓ విషయం బాహుబలి షూటింగ్ సమయంలో జరిగింది. ఈ విషయాన్ని బాహుబలికి పని చేసిన ఓ టెక్నీషియన్ మీడియాతో షేర్ చేసుకున్నారు.


ప్రభాస్‌ (Prabhas)ను పాన్‌ ఇండియా స్టార్‌ను చేసిన చిత్రం ‘బాహుబలి’ (Baahubali). రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది.

ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమాకి 8 ఏళ్లు. ప్రభాస్‌ (Prabhas), రానా (Rana Daggubati), అనుష్క (Anushka Shetty), తమన్నా (Tamannaah Bhatia), రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. రాజమౌళి (Rajamouli) టేకింగ్‌, ఎం. ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరా వర్క్‌ ఇలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.  


Baahubali 3 , rajamouli, Kanguva, prabhas


ఈ సినిమా సెకండ్  పార్ట్ షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంట్రడక్షన్ ..రథం లాగుతూ రావాలి. అది సహజంగా కనిపించేలా ఊపిరి బిగపట్టి లాగాలి. లేకపోతే మొహంలో ఆ ఎక్సప్రెషన్ కనపడదు. అది టెక్నికల్ రీజన్స్ తో ఎనిమిది సార్లు షూట్ చేసారు.

ఆ తర్వాత మనం కూడా చేసి చూద్దాం అని టెక్నీషియన్ వెళ్లి రథం ప్రభాస్ లాగినట్లే చేసి చూసినప్పుడు కళ్లు తిరిగాయి. అలా ఒక్కసారికే కళ్లు తిరిగితే ఎనిమిది  సార్లు గ్యాప్ లేకుండా ఎలా ప్రభాస్ చేసాడో వాళ్లకు అర్దం కాలేదుట. అయితే ఆ సీన్ షూట్ అయ్యాక ప్రబాస్...నాకు కళ్లు తిరుగుతున్నట్లున్నాయి. కార్వాన్ ఇవ్వండి అంటూ కార్వాన్ లోకి వెళ్లారట. అంటే ఓ రకంగా ఒగ్గపట్టుకుని ఆ సీన్ బాగా రావటం కోసం చాలా కష్టపడ్డారు ప్రభాస్. అందుకే ఆ సినిమా ఆ స్దాయి సక్సెస్ అయ్యింది. 

Anushka, Prabhas, baahubali


ఇక ‘‘బాహుబలి’ చేయాలనుకున్నప్పుడే దానిని రెండు భాగాల్లో తెరకెక్కించాలనుకున్నారు.  బడ్జెట్‌, కథకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో పార్ట్‌-2 అనేది చాలా అరుదు. ఒక చిత్రాన్ని రెండు భాగాల్లో తెరకెక్కిస్తే చూస్తారా? సెకండ్‌ పార్ట్‌ వెంటనే విడుదల చేయకపోతే పార్ట్‌-1 మర్చిపోతారా? అని ఎన్నో సందేహాలు నిర్మాతకు వచ్చాయి.

రెండు పార్ట్‌లను కలిపి ఒకేసారి షూట్‌ చేసేద్దామనుకున్నారు. పార్ట్‌-1 విడుదలైన మూడు నెలల్లోనే పార్ట్‌-2 రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. సినిమా షూట్‌ మొదలయ్యాక అనుకున్న బడ్జెట్‌లో అది పూర్తికాదని అర్థమైంది. ఆవిధంగా ముందు ఫస్ట్‌ పార్ట్‌ షూట్‌ చేసి రిలీజ్‌ చేశాం చేసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూట్ చేసారు. 


నిర్మాత మాట్లాడుతూ... తొలిరోజు నెగిటివ్‌ టాక్ వచ్చినప్పుడు పైకి రిలాక్స్‌గా ఉన్నా తాను లోలోపల భయపడినట్లు చెప్పారు. నిజంగానే నెగిటివ్‌ టాక్‌ వస్తే ఏం చేయాలి? తదుపరి భాగం ఎలా చేయాలి? అని ఆ సమయంలో రాజమౌళి ప్లాన్‌ చేశారన్నారు.

అదృష్టవశాత్తూ తమ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుందన్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్‌’గా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. పార్ట్‌-1 విడుదలైన రెండేళ్ల తర్వాత పార్ట్‌-2ను విడుదల చేశారు.

Latest Videos

click me!