బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు

Published : Jun 17, 2025, 07:25 AM IST

బాలకృష్ణ సీరియస్‌ పర్సన్‌, కొడతాడనే ప్రచారం జరుగుతుంది. అయితే తనతో పనిచేసే ఓ నటుడి భార్యకి ఆయన ముందే ఫోన్‌ చేశాడట. అది పెద్ద రచ్చ అయ్యిందని వెల్లడించారు. 

PREV
15
బాలకృష్ణ ఇమేజ్‌ని మార్చేసిన `అన్‌ స్టాపబుల్‌` షో

నందమూరి బాలకృష్ణ `అన్‌ స్టాపబుల్‌` షోకి ముందు వేరు, ఈ షో తర్వాత ఆయన వేరు అని చెప్పాలి. అప్పటి వరకు బాలయ్యపై నెగటివ్‌ ప్రచారం ఉండేది. ఆయన సీరియస్‌గా ఉంటాడు, సెట్లో అందరిపై అరుస్తాడు. కొడతాడనే కామెంట్స్ తరచూ వినిపించేవి. 

అంతేకాదు పలు ఈవెంట్లలో అభిమానులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.  పైగా ఆయన చాలా వరకు సీరియస్‌గా కనిపిస్తుండటంతో అంతా అదే అనుకున్నారు. 

కానీ `అన్‌ స్టాపబుల్‌` షో వాటిని పటాపంచల్‌ చేసింది. ఆయనలోని మరో వ్యక్తిని బయటకు తీసింది. బాలయ్య సీరియస్‌ కాదు, చాలా జోవియల్‌ పర్సన్‌ అనే విషయాన్ని చాటి చెప్పింది. అందుకే ఈ షో నేషనల్‌ వైడ్‌గా సక్సెస్‌ అయ్యింది.

25
బాలకృష్ణ రియాలిటీ బయటపెట్టిన ఆర్టిస్టులు

బాలకృష్ణ రియాలిటీ ఏంటో ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా చెబుతుంటారు. బయట జరిగే ప్రచారం నిజం కాదని, ఆయన సరదాగా ఉంటాడని చెబుతుంటాడు. 

ఆ మధ్య రోజా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బాలకృష్ణ సెట్‌లో ఉంటే సందడే సందడి అని, అంతా ఆయన వద్దకు వెళ్లిపోతామని, ఆయన జోకులు వేస్తూ, సరదాగా కామెంట్లు చేస్తూ నవ్విస్తుంటారని తెలిపారు.

 అయితే నటుడు సమీర్‌ మాత్రం బాలయ్య చేసిన చిలిపి పని బయట పెట్టాడు. అది ఎవరితోనో కాదు, తన ఇంట్లోనే గొడవ పెట్టాడని, తన భార్యకు ఫోన్‌ చేసి పెద్ద రచ్చ క్రియేట్‌ చేశాడని తెలిపారు.

35
నటుడు సమీర్‌ బాలయ్యకి చాలా క్లోజ్‌

నటుడు సమీర్‌.. దాదాపు బాలకృష్ణ నటించిన అన్ని సినిమాల్లోనూ ఉంటారు. బాలయ్య కోరుకునే, ఇష్టపడే నటులు కొందరు ఉంటారు. వారిలో సమీర్‌ ఒకరు. అందుకే బాలకృష్ణ ప్రతి సినిమాలోనూ ఆయన కనిపించాల్సిందే. 

పాత్ర ఏదైనా ఆయన నటించాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. దీంతో బాలకృష్ణతో మంచి ర్యాపో ఉంది. చాలా క్లోజ్‌గానూ ఉంటారు. అంతే సరదాగానూ ఉంటారు. అయితే ఈ సరదా కాస్త తన ఇంట్లో పెద్ద రచ్చకు దారితీసిందట. 

బాలయ్య చేసిన పనికి తన భార్యతో గొడవ అయ్యిందని, తన భార్య ముందు తనని ఇరికించాడని తెలిపారు నటుడు సమీర్‌. మరి ఇంతకి బాలయ్య ఏం చేశారో సమీర్‌ వెల్లడించారు.

45
సమీర్‌ ముందే తన భార్యకి ఫోన్‌ చేసిన బాలయ్య

ఓ రోజు బాలకృష్ణ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. షూటింగ్‌ స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్‌ ఉంది. సరదాగా అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఈ క్రమంలో సడెన్‌గా బాలకృష్ణ తన భార్య నెంబర్ అడిగాడట. దెబ్బకి నటుడు సమీర్‌కి ఫీజులు ఎగిరిపోయాయి. 

తన భార్య నెంబర్‌ అడుగుతున్నాడేంటి అనే సందేహం కలిగింది. ఎందుకుసార్‌, నేను చేస్తాను అని అన్నాడట. ఏ మీ భార్య నెంబర్‌ నాకు ఇవ్వవా అని కాస్త గద్దాయింపుగా అడిగాడట బాలయ్య. నటుడు సమీర్ కూడా కాస్త ఆయోమయంలోనే ఆ నెంబర్‌ ఇచ్చాడు. 

తనముందే తన భార్యకి ఫోన్‌ చేశాడట బాలకృష్ణ. ఆయన ఫోన్‌ చేయడంతో సమీర్ భార్య షాక్‌ అయ్యిందట. ఏ బాలకృష్ణ అని అడిగితే, నేను నందమూరి బాలకృష్ణని అమ్మ అన్నాడట.

55
బాలయ్య చిలిపి పనికి అంతా షాక్‌

దెబ్బకి సర్‌ సర్‌ అంటూ ఆమె రియాక్ట్ అయ్యింది. `మీ సమీర్‌ ఉన్నాడా అమ్మ, షూటింగ్‌కి రాలేదు, మేనేజర్‌కి ఫోన్‌ చేస్తే కలవడం లేదు. మేమంతా వెయిట్‌ చేస్తున్నాం. ఒక్కసారి కనుక్కోండి, షూటింగ్‌ వస్తాడా? రాడా అని, వస్తాడంటే వెయిట్‌ చేస్తాం, లేదంటే ప్యాకప్‌ చెప్పుకొని వెళ్లిపోతామని అన్నాడట బాలయ్య. ఫోన్‌ పెట్టేశాడు. 

దీంతో ఇది విని సమీర్‌ కి కూడా మతిపోయింది. అదేంటి సార్‌ అలా అన్నారేంటి అంటే, సైలైంట్‌గా ఉండు అన్నాడట. ఆ వెంటనే తన భార్య నుంచి సమీర్‌కి ఫోన్‌ వచ్చింది. ఆమె ఫోన్‌ చేయడంతోనే ఆమె ఫైర్ అయ్యిందట. కాసేపు ఇద్దరి మధ్య రచ్చ అయ్యిందట.

 ఆ తర్వాత బాలయ్యనే ఫోన్‌ తీసుకుని జరిగిన విషయం చెప్పి కూల్‌ చేశారు. అలా బాలకృష్ణ మామూలోడు కాదు, చాలా సరదాగా మాత్రమే కాదు, ఇలాంటి చిలిపి పనులు కూడా చేస్తుంటాడని తెలిపారు నటుడు సమీర్‌. ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారాయన.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories