Kalki 2- Deepika Padukone: ప్రభాస్ - నాగ్ ఆశ్విన్ కాంబో మూవీ "కల్కి పార్ట్ 2" నుంచి షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించబోవడం లేదని వైజయంతీ మూవీస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది.
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2898 AD’ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కింది. విజువల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి, ఇండియన్ సినిమాకి కొత్త గౌరవాన్ని మరింత పెంచింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన “కల్కి 2898 AD” కి సీక్వెల్‌గా కల్కి 2 రాబోతోంది. ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో పోషించారు. అయితే తాజా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటీ?
25
దీపికా పదుకొణె నటన అద్బుతం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది కల్కి 2898 AD. ఇండియన్ సినిమాకి కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీపిక తన ప్రత్యేక నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్ర బృందానికి సహకరించి నటించడం విశేషంగా నిలిచింది. సినిమాలో ఆమె పోషించిన "సుమతి" పాత్ర కథలో ప్రధానంగా నిలిచి, సీక్వెల్‌లో మరింత ప్రాధాన్యత వహిస్తుందని అభిమానులు ఊహించారు.
35
మూవీ మేకర్స్ షాకింగ్ స్టేట్ మెంట్
ఎన్నో అంచనాలతో తెరకెక్కబోతున్న కల్కి 2 లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కల్కి పార్ట్ 2" లో దీపికా పదుకొణె నటించబోవడం లేదని చిత్రం యూనిట్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు వైజయంతీ మూవీస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది. అందులో ‘కల్కి 2లో నటి దీపికా పదుకొణె భాగం కాబోవడం లేదు. అనేక చర్చలు, పరిశీలనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో ఆమె మాతో కలిసి దీర్ఘకాలం ప్రయాణం చేసినప్పటికీ, పార్ట్ 2 లో అలా సాధ్యపడలేదు. కల్కి లాంటి ప్రాజెక్ట్‌కి సంపూర్ణ నిబద్ధత అవసరం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు.
వైజయంతీ మూవీస్ ట్విట్ వెనుక అసలు కారణం స్పష్టమైందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె రోజుకు 8 గంటలకంటే ఎక్కువ పని చేయనని ఒక కొత్త షరతు పెట్టుకున్నారట. అయితే, ‘కల్కి’ లాంటి భారీ స్థాయి ప్రాజెక్ట్‌లో ఇలాంటి కండీషన్లు అనుకూలించవని అప్పట్లోనే టాక్ వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు "పూర్తి నిబద్ధత అవసరం" అని ప్రకటించడం ఆ వార్తలకు బలం చేకూర్చినట్లే కనిపిస్తోంది. అలాగే.. ఇటీవల తల్లి అయిన దీపికా, తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు నెలల తరబడి కంటిన్యూగా షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. కానీ కుటుంబ బాధ్యతలు, బిడ్డతో గడిపే సమయం కారణంగా దీపికా పూర్తిస్థాయి అంకితభావాన్ని చూపలేకపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎటువంటి విభేదాల వల్ల కాదని, కేవలం పని శైలి, కట్టుబాట్ల సమస్య వల్లనే ఇలా జరిగిందని అర్థమవుతోంది.
55
కల్కి 2 పై భారీ అంచనాలు
2024లో విడుదలైన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ప్రభాస్ ‘భైరవ’గా, దీపికా పదుకొణె ‘సుమతి’గా, అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా, కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భవిష్యత్తు ప్రపంచాన్ని ప్రతిబింబించే కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ నిర్మాణం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే రెండో భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. దీపికా సీక్వెల్ నుంచి తప్పుకోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ ఎవరనేది సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ విషయంపై మూవీ మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.