Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార , డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతుల మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా? సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టిన ఈ జంట ఎంత సంపాదిస్తున్నారంటే?
సౌత్ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది నయనతార. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయస్సులో కూడా స్టార్ హోదాను అనుభవిస్తూ భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. ఆమె భర్త విఘ్నేష్ శివన్ మరోవైపు దర్శకత్వం, నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఈ దంపతుల ఆస్తి వివరాలు చూద్దాం.
24
నయనతార ఆస్తి విలువ
దక్షిణ భారత సినిమా "లేడీ సూపర్ స్టార్" నయనతార అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక్కో సినిమాకు నయన్ 10 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం ఆమె సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె నికర ఆస్తి విలువ 200-220 కోట్లకు పైనే ఉంటుందని అంచన.
34
విఘ్నేష్ శివన్ ఆస్తి విలువ
విఘ్నేష్ శివన్ ఒక విజయవంతమైన చిత్ర నిర్మాత, గీత రచయిత, దర్శకుడు. నయనతారతో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన ఆస్తి విలువ 50 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా.
నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరు కలిసి సినిమాలు నటించడం, నిర్మించడం, దర్శకత్వం, ఇతన పనులను చేస్తున్నారు. అంతే కాదు సినిమాల నుంచి సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నయనతార కొన్ని బిజినెస్ లు చేస్తోంది. అంతే కాదు దుబయ్ లో ఉన్న తన అన్న చేస్తున్న వ్యాపారంలో కూడా ఆమె పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అంతే కాదు నయనతార కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా చేతినిండా సంపాదిస్తోంది. ఇక ఈరకంగా చూసుకుంటే ఈ జంట ఇద్దిరికి కలిపి మొత్తంగా 270 నుంచి 300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.