బాలకృష్ణని కోలుకోలేని దెబ్బకొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఈ ఇద్దరికి మైండ్‌ బ్లాక్‌ చేసిన రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌

Published : Sep 21, 2025, 07:40 AM IST

బాలకృష్ణ, కృష్ణ మధ్య చాలా సందర్భాల్లో పోటీ నెలకొంది. అయితే 1988లో మాత్రం బాలయ్యని కోలుకోలేని దెబ్బ కొట్టారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. వీరిద్దరు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌ ఝలక్‌ ఇవ్వడం విశేషం. 

PREV
14
బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ కృష్ణ మధ్య బాక్సాఫీసు పోటీ

సినిమా పరిశ్రమలో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం, లేదంటే బ్యాక్‌ టూ బ్యాక్‌ పోటీగా రావడం కామన్‌గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఒకే రోజు విడుదలైతే పెద్ద నష్టం. కానీ ఒకప్పుడు వారం గ్యాప్‌తో వచ్చినా నష్టమే. అప్పుడు లిమిటెడ్‌ థియేటర్లలో సినిమాలు విడుదలయ్యేవి. ఎక్కువ రోజులు ఆడేవి. అలాంటిది విడుదలైన వారానికే మరో పెద్ద మూవీ విడుదలైతే కచ్చితంగా ముందు సినిమాపై ప్రభావం పడుతుంది. 1988 ఫిబ్రవరిలో అదే జరిగింది. బాలయ్య, సూపర్‌ స్టార్‌ కృష్ణ విషయంలో అదే జరిగింది. ఆ సమయంలో ఈ ఇద్దరిని చావుదెబ్బ కొట్టారు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌. ఆ కథేంటో చూద్దాం.

24
బాలయ్యని నిరాశపరిచిన `దొంగరాముడు`

1988, ఫిబ్రవరి 18న బాలయ్య నటించిన `దొంగరాముడు` విడుదలయ్యింది. దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా పీక్‌లో ఉన్న టైమ్‌లో రాఘవేంద్రరావు నుంచి వచ్చిన చిత్రమిది. ఇందులో బాలయ్యకి జోడీగా రాధ హీరోయిన్‌గా నటించింది. చక్రవర్తి సంగీతం అందించారు.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా డౌన్‌ అయ్యింది.

34
బాలయ్యని చావు దెబ్బ కొట్టిన కృష్ణ `చుట్టాలబ్బాయి`

ఆ సమయంలోనే వారం గ్యాప్‌తో విడుదలైంది సూపర్‌ స్టార్‌ కృష్ణ `చుట్టాలబ్బాయి`. కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో కృష్ణకి జోడీగా రాధ, సుహాసిని నటించారు. ఈ మూవీకి మిశ్రమస్పందన లభించింది. ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. అయితే బాలయ్య నటించిన `దొంగరాముడు` కంటే బెటర్‌గా ఉండటంతో ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపించారు. పైగా ఫ్యామిలీ మూవీ కావడంతో లాంగ్‌ రన్‌లో మంచి కలెక్షన్లని సాధించింది. కానీ ఈ మూవీ  దెబ్బకి బాలయ్య `దొంగరాముడు` కుదేలయ్యింది. డిజాస్టర్‌గా నిలిచింది.

44
బాలయ్య, కృష్ణలకు మైండ్‌ బ్లాక్‌ చేసిన రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌

ఇలాంటి సమయంలో అటు బాలయ్యకి, ఇటు సూపర్‌ స్టార్‌లకు మైండ్‌ బ్లాక్‌ చేసి చావు దెబ్బ కొట్టారు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌. ఈ ఇద్దరు కలిసి నటించిన `స్టేషన్‌ మాస్టర్‌` మూవీ వారం గ్యాప్‌తో అంటే మార్చి 2న విడుదలైంది. దీనికి కోడి రామకృష్ణనే దర్శకుడు కావడం విశేషం. ఆయన డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు వారం గ్యాప్‌తోనే విడుదల కావడం మరో విశేషం. ఇందులో జీవిత, అశ్వినీ హీరోయిన్లుగా నటించారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన `స్టేషన్‌ మాస్టర్‌` బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. అటు బాలయ్య `దొంగరాముడు`, ఇటు కృష్ణ `చుట్టాలబ్బాయి`కి సాలిడ్‌గా ఝలక్‌ ఇచ్చింది. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో యావరేజ్‌గా ఆడాల్సిన `దొంగరాముడు` డిజాస్టర్‌ కాగా, హిట్‌ కావాల్సిన `చుట్టాలబ్బాయి` యావరేజ్‌గా మిగిలిపోయింది. `స్టేషన్‌ మాస్టర్‌` బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. కంటెంట్‌ బాగుంటే స్టార్‌ తో సంబంధం లేకుండా సినిమాలు ఆడతాయని నలభై ఏళ్ల క్రితమే నిరూపితమైంది. అప్పటికీ రాజశేఖర్‌ పెద్ద స్టార్‌ కాదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories