ఇలా పవన్ కళ్యాణ్ `ఖుషి`, మహేష్ బాబు `ఒక్కడు`, ఎన్టీఆర్ `సింహాద్రి`లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే కావడం విశేషం. ఆమెనే భూమిక. `యువకుడు` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి `ఖుషి`తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో టాప్ 1 హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు రష్మిక లాగా, అప్పుడు భూమిక ఇండస్ట్రీని శాసించిందని చెప్పొచ్చు. `ఖుషి`, `ఒక్కడు`, `సింహాద్రి`, `మిస్సమ్మ`, `సాంబా`, `వాసు`, `నా ఆటోగ్రాఫ్`, `జై చిరంజీవా`, `మాయబజార్`, `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. మధ్యలో కొంత కాలం గ్యాప్ తీసుకుంది. నాని `ఎంసీఏ`తో మళ్లీ కమ్ బ్యాక్ అయ్యింది. చివరగా `సీతారామం` చిత్రంలో మెరిసింది భూమిక. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది.