రీతూ చౌదరీ చేసిన మోసం బయటపెట్టిన నాగార్జున.. ప్రియుడి కోసం అంతగా తెగించిందా? హరీష్‌కి ఝలక్‌

Published : Sep 21, 2025, 12:04 AM IST

రీతూ చౌదరీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇద్దరు కుర్రాళ్లతో పులిహోర కలుపుతూ కంటెంట్‌ ఇచ్చింది. కానీ కెప్టెన్సీ విషయంలో రీతూ చౌదరీ మోసం చేసింది.  ఆ మోసం ఏంటో తెలుసుకుందాం.   

PREV
15
రీతూ చుట్టూతే బిగ్‌ బాస్‌ షో

రీతూ చౌదరీ ఏదో రకంగా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వైపు టాస్క్ ల విషయంలో హడావుడి చేస్తోంది. గట్టిగా వాదిస్తోంది. రచ్చ రచ్చ చేస్తోంది. మరోవైపు హౌజ్‌లో కుర్రాళ్లతో పులిహోర కలపడంలోనూ ముందే ఉంటుంది. డీమాన్‌ పవన్‌తో ఆమె ప్రారంభం నుంచి పులిహోర కలుపుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పుడు కళ్యాణ్‌ని కూడా యాడ్‌ చేసుకుంది. ఆ ఇద్దరిని కలిపి రుబ్బేస్తుంది. బిగ్‌ బాస్‌కి కావాల్సిన కంటెంట్‌ ఇస్తోంది.

25
రీతూ చౌదరీ చేసిన మోసం బట్టబయలు

ఇదిలా ఉంటే రీతూలో మరో కోణం కూడా ఉంది. తన అనుకునేవారికోసం ఎంతకైనా తెగించే స్వభావం కూడా ఉంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆమె చేసిన మోసాన్ని బయటపెట్టాడు హోస్ట్ నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని వీడియోలు చూపించి మరీ బండారం బయటపెట్టారు. డీమాన్‌ పవన్‌ ని కెప్టెన్‌ చేయడం కోసం ఆమె ఎంత మందిని ప్రభావితం చేసిందనేది స్పష్టంగా చూపించాడు నాగ్‌. అటు ప్రియా  చేసిన మోసాన్ని వెల్లడించారు. టెనెంట్లని టార్గెట్‌ చేసి ఎలా గేమ్‌ ఆడారనేది చూపించాడు నాగార్జున.

35
ప్రియుడి కోసం తెగించిన రీతూ

కెప్టెన్సీ ఎంపిక ఫెయిర్‌గానే జరిగిందా అనేది అందరి అభిప్రాయం తీసుకున్నారు నాగ్‌. అలాగే ఏం చేశారో వారి అభిప్రాయాన్ని అడిగారు. ఎలా మిస్టేక్‌ జరిగిందో తెలిపారు. ఈ టాస్క్ లో రీతూ, ప్రియాలు పూర్తిగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనేది స్పష్టమైంది. ఫెయిర్‌గా ఆడిన భరణిని, ఇమ్మాన్యుయెల్‌ని తొక్కేశారు. వీడియోలు చూపించడంతో అటు రీతూ, ఇటు ప్రియా నోరెళ్లపెట్టారు. ఎంతగా డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసినా వారికి కౌంటర్లు ఇచ్చారు నాగ్. వాస్తవాలను బయటపెట్టి కెప్టెన్సీ టాస్క్ విషయంలో సంచాలక్‌గా ఉన్న రీతూ తీసుకున్న నిర్ణయం తప్పు అని తేల్చేశాడు.  దీన్ని డీమాన్‌ పవన్‌ కూడా ఒప్పుకున్నట్టుగానే ప్రవర్తించాడు. దీంతో కెప్టెన్సీని రద్దు చేశారు. కొత్త కెప్టెన్‌ ఎవరనేది ఆదివారం ఎపిసోడ్‌లో నిర్ణయిస్తామని తెలిపారు నాగార్జున.

45
రాంగ్‌గా కెప్టెన్‌ అయిన డీమాన్‌ పవన్‌కి షాక్‌

మొత్తంగా డీమాన్‌ పవన్‌ని కెప్టెన్‌ని చేసేందుకు రీతూ చౌదరీ చేసిన మోసాన్ని నాగార్జున బయటపెట్టారు. దీంతో మొహం చాటేసింది రీతూ. దెబ్బకి ప్రియా, మనీష్‌ వంటి వారు కూడా సైలెంట్‌ అయ్యారు. మరోవైపు హోనర్‌ అయ్యే టాస్క్ లోనూ సుమన్‌ శెట్టి విషయంలో సంచాలక్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రియా ఎలా ఆ రాంగ్‌ డెసీషన్‌ తీసుకుంటుందని ప్రశ్నించారు. తమ వారికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇందులో భాగంగా తమ కోసం గేమ్‌ ఆడాలని, సాక్రిఫైజ్‌ చేయడం సరికాదన్నారు. ఇక రాము సైలెంట్‌గా ఉండటాన్ని కూడా ప్రశ్నించాడు. అలా ఉండకూడదని, తమ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా డిఫెన్స్ చేసుకోవాలని తెలిపారు.

55
హరీష్‌కి నాగార్జున ఝలక్‌

ఇక ఇందులో హరిత హరీష్‌కి ఝలక్‌ ఇచ్చాడు నాగార్జున. మొదట హరీష్‌ భార్య హరితతో మాట్లాడారు. తాము అంతా బాగానే ఉన్నామని ఆమె తెలిపింది. ఆయనకు మూడు విషయాలు చెప్పింది. బిగ్‌ బాస్‌కి వెళ్లిన ఉద్దేశ్యమేంటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్‌, నెక్ట్స్‌ టార్గెట్‌ ఏంటి? ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని గేమ్‌ ఆడాలని, ఆయన బయటకురావడం సరైనది కాదు అని ఆమె తెలిపింది. నాగార్జున ఇదే విషయాన్ని హరీష్‌కి చెప్పాడు. భోజనంపై అలగొద్దని, అదే సమయంలో తన భార్య చెప్పిన మూడు విషయాలను పాటించాలని తెలిపారు. అయితే దమ్ముంటే పంపించూ అని గతంలో వ్యాఖ్యలు చేశారు. దాన్ని ప్రశ్నించారు. తాను బిగ్‌ బాస్‌ని అనలేదని, కంటెస్టెంట్లని అన్నట్టుగా తెలిపారు. హౌజ్‌ నుంచి వెళ్లిపోతావా? అని అడిగాడు నాగ్‌. దానికి తన ఉద్దేశ్యం అది కాదని తెలిపారు. మొత్తంగా హరీష్‌ని కూల్‌ చేసే ప్రయత్నం చేశారు నాగ్‌. భోజనం విషయంలో మనీష్‌కి కూడా క్లాస్‌ పీకాడు నాగ్‌. ఇక ఈ వారం తప్పులు చేసిన రీతూ చౌదరీ, మనీష్‌, ప్రియా, శ్రీజలకు రెడ్‌ మార్క్ ఇచ్చాడు నాగ్‌. ఇక చివర్లో పెద్ద ట్టిస్ట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు హోనర్లుగా ఉన్న వారిని టెనెంట్‌లుగా, టెనెంట్‌లను హోనర్లుగా మార్చి పెద్ద ట్విస్ట్ ఇవ్వడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories