ఎన్టీఆర్ మూవీ టైటిల్ తో రీమేక్.. బాలయ్యకి చుక్కలు చూపించిన చిరు, విజయశాంతి

Published : Sep 17, 2025, 08:23 PM IST

పలు సందర్భాల్లో చిరంజీవి, బాలయ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. 1986లో ఆసక్తికర పోటీ నెలకొంది. చిరంజీవి కొండవీటి రాజా, బాలయ్య నిప్పులాంటి మనిషి చిత్రాలు వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాల రిజల్ట్ ఏమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ 

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఎప్పుడు పోటీ పడినా ఆ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. గతంలో పలు సందర్భాల్లో చిరంజీవి, బాలయ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. 1986లో ఆసక్తికర పోటీ నెలకొంది. చిరంజీవి కొండవీటి రాజా, బాలయ్య నిప్పులాంటి మనిషి చిత్రాలు వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. 

25
వారం గ్యాప్ లో చిరంజీవి, బాలయ్య చిత్రాలు రిలీజ్ 

 రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి, రాధా, విజయశాంతి కలిసి నటించిన కొండవీటి రాజా చిత్రం 1986 జనవరి 31న విడుదలైంది. కొండవీటి రాజా చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో వారం వ్యవధిలో బాలయ్య నిప్పులాంటి మనిషి చిత్రం రిలీజ్ అయింది. అంతకు ముందు ఎన్టీఆర్ ఇదే టైటిల్ తో మోవీవీ చేశారు. 

35
రీమేక్ మూవీగా నిప్పులాంటి మనిషి 

తన తండ్రి సినిమా టైటిల్ నే తీసుకున్న బాలయ్య హిందీలో ఖయామత్ చిత్రానికి రీమేక్ గా నిప్పులాంటి మనిషి చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో కూడా హీరోయిన్ గా రాధ నటించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. 

45
ఘనవిజయం సాధించిన కొండవీటి రాజా 

చిరంజీవి కొండవీటి రాజా చిత్రం అద్భుతమైన వసూళ్లతో ఘనవిజయం సాధించగా.. బాలయ్య నిప్పులాంటి మనిషి మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. ఎస్ బి చంద్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 

55
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ 

చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఫ్యాన్స్ సూపర్ హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయేవారు. వీరి కాంబినేషన్ లో కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయం కృషి లాంటి చిత్రాల్లో నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories