80 స్టార్స్ రీయూనియన్‌కి భానుప్రియ ఎందుకు అటెండ్‌ కాదో తెలుసా? వాళ్లకి అనుమతి లేదు, తెరవెనుక కథ

Published : Sep 17, 2025, 07:31 PM IST

80 స్టార్స్ రీయూనియన్‌ పేరుతో ప్రతి ఏడాది మన బిగ్‌ స్టార్స్ కలుసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే దీనికి భానుప్రియ హాజరు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తెరవెనుక విషయాలు. 

PREV
15
ప్రతి ఏడాది `80 స్టార్స్ రీయూనియన్‌`

ఇండియన్‌ సినిమాలో 80 స్టార్స్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సమయంలో వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేసి స్టార్స్. ఓ గోల్డెన్‌ ఎరాని చూసిన ఆర్టిస్ట్ లు. వారంతా ప్రతి ఏడాది కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అప్పట్లో తమ మధ్య జరిగిన ఫన్నీ విషయాలను చర్చించుకుంటారు. సరదాగా ఎంజాయ్‌ చేస్తారు. డాన్సులు వేస్తారు. డిన్నర్‌ చేస్తారు. ఆటాపాటలతో ఆద్యంతం ఎంటర్‌టైన్‌ అవుతారు. రీ ఫ్రెష్‌ అవుతారు. ప్రతి ఏడాది ఈ స్టార్స్ అంతా రీ యూనియర్‌ అవుతారు. అందుకు ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఆతిథ్యం ఇస్తారు.

25
80 స్టార్స్ రీయూనియన్‌లో పాల్గొనేది వీరే

80 స్టార్స్ రీయూనియన్‌లో చిరంజీవి, వెంకటేష్‌, రమ్యకృష్ణ, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, రాధిక, రాధ, నదియా, శోభన, మీనా, సుహాసిని, సుమలత, రేవతి, రమేష్‌ అరవింద్‌, జాకీ ష్రాఫ్‌, రెహ్మాన్, భానుచందర్‌, సురేష్‌, ఖుష్బు, సుమన్‌, ప్రభు, జయరాం, నరేష్‌, జగపతిబాబు, జయసుధ, జయప్రద, నాగార్జున, అర్జున్‌ వంటివారు కలుస్తుంటారు. ఇందులో టాలీవుఢ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌, మాలీవుడ్‌తోపాటు ఒకరిద్దరు బాలీవుడ్‌ స్టార్స్ కూడా ఉంటారు. ప్రతి ఏడాది తప్పకుండా వీరంతా కలుస్తుంటారు. తమ పాత గుర్తులను నెమరేసుకుంటారు. తమ సంతోషాలను పంచుకుంటారు. బాధలను షేర్‌ చేసుకుంటారు. ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటారు. తమ మధ్య బాండింగ్‌ని తెలియజేస్తుంటారు.

35
భానుప్రియ ఎందుకు మిస్‌ అయ్యిందంటే?

అయితే 80 స్టార్స్ లో కొందరు మిస్‌ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భానుప్రియ. ఆమె ఆ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. చాలా వరకు ట్రెడిషనల్‌ రోల్సే చేసింది. అడపాదడపా గ్లామర్‌ పాత్రల్లోనూ మెరిసింది. అయితే భానుప్రియ ప్రారంభంలో ఈ రీయూనియన్‌లో అంటెండ్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత రావడం మానేసింది. ఆమె ఎందుకు మిస్‌ అయ్యింది? ఎందుకు రావడం లేదనేది తాజాగా సీనియర్‌ నటుడు భానుచందర్‌ ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

45
ఫ్యామిలీ ఇష్యూస్‌ కారణంగా రీయూనియన్‌కి దూరంగా భానుప్రియ

భానుప్రియ ఫ్యామిలీలో గొడవల కారణంగా రాలేకపోయిందని వెల్లడించారు భానుచందర్. ఆ తర్వాత చాలా ప్రయత్నించినా కుదరలేదన్నారు. తను చాలా డిస్టర్బ్ గా ఉండిపోయిందని, కలవలేకపోయిందన్నారు. ఆమెని చాలా మిస్ చేస్తున్నట్టు తెలిపారు భానుచందర్‌. అయితే భానుప్రియ 1998లో డిజిటల్‌ గ్రాఫిక్స్ ఇంజనీర్‌ ఆదర్శ్‌ కౌశల్‌ని వివాహం చేసుకుంది. 2002లో వీరికి కూతురు అభినయ జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన భాను ప్రియ కూతురు పెరిగాక యూఎస్‌ నుంచి ఇండియా వచ్చేసింది. చెన్నైలో ఉంటూ మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. అలా మంచి రోల్స్ వచ్చాయి. అయితే ఆ సమయంలో తన ఫ్యామిలీలో గొడవలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె రాలేకపోయింది. ఇక 2018లో భానుప్రియ భర్త కౌశల్‌ మరణించారు. ఆ తర్వాత మరింతగా కుంగిపోయిందామే.

55
రీయూనియన్‌ మీట్‌లో వారి అనుమతి లేదు

ఇదిలా ఉంటే ఈ 80 స్టార్స్ రీయూనియన్‌లో కేవలం నటీనటులు మాత్రమే హాజరవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కనిపించరు. అయితే దీని వెనుక ఓ రూల్‌ ఉందట. ఇందులో ఫ్యామిలీకి అనుమతి లేదట. అప్పటి హీరోహీరోయిన్లు కాబట్టి ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అందులో లవ్‌ ట్రాక్‌లు కూడా  ఉంటాయి. ఫ్యామిలీ, పిల్లలు వస్తే ఫ్రీగా మూవ్‌ అయ్యే ఫ్రీడమ్‌ ఉండదు. సరదాగా ఉండలేమని, అందుకే ఫ్యామిలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు భానుచందర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories