27 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న నారా రోహిత్ లేటెస్ట్ మూవీ.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే ?

Published : Sep 17, 2025, 07:02 PM IST

Sundarakanda Movie OTT release date : నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం ఏ ఓటీటీ లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Sundarakanda Movie OTT release date

నారా రోహిత్ ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ గతేడాది ప్రతినిధి 2 తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది నారా రోహిత్ నుంచి ఇప్పటికే 2 చిత్రాలు విడుదలయ్యాయి. మే నెలలో రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ భైరవంలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లతో నారా రోహిత్ నటించారు. ఆ మూవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 

25
సుందరకాండ చిత్రం

గత నెలలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ కలసి నటించిన సుందరకాండ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అయిందని అంతా అన్నారు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అయితే పొందలేకపోయింది. 

35
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

థియేటర్స్ లో రిలీజైన 27 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో సుందరకాండ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి సుందరకాండ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. 

45
కథ ఏంటంటే

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. నారా రోహిత్ 30 ఏళ్ళు దాటినప్పటికీ బ్యాచిలర్ గానే ఉంటాడు. తాను స్కూల్ లో ప్రేమించిన శ్రీదేవి విజయ్ కుమార్ లాంటి అమ్మాయి దొరికేవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. శ్రీదేవి విజయ్ కుమార్ స్కూల్ లో నారా రోహిత్ కి సీనియర్. చాలా సంబంధాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేస్తుంటాడు. 

55
బోల్డ్ కాన్సెప్ట్

ఒకసారి హీరోయిన్ వృతి వాఘానిని చూసి తనకి నచ్చే లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయని భావిస్తాడు. దీనితో ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. హీరోయిన్ ని ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత శ్రీదేవి విజయ్ కుమార్ పాత్ర తిరిగి ఎలా ఎంట్రీ ఇస్తుంది ? ఆ తర్వాత కథ ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కథ కాస్త బోల్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. బుల్లితెరపై ఈ చిత్రాన్ని మరికొన్ని రోజుల్లోనే ఎంజాయ్ చేయవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories