సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?

Published : Dec 10, 2025, 11:40 AM IST

బాలయ్య దెబ్బకు 14 చిన్న సినిమాల రిలీజ్ అగమ్య గోచరంగా మారింది. అఖండ 2 రిలీజ్ తో టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమకు కూడా భారీ షాక్ తగిలింది. ఇంతకీ విషయం ఏంటంటే?

PREV
14
అఖండ 2 రిలీజ్ పై క్లారిటీ...

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఐదోవ సినిమా `అఖండ 2`. ఈ సినిమా గత వారం 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. నిర్మాతల ఆర్థిక పరమైన లావాదేవిల సమస్యలతో అఖండ2 వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ప్లస్‌ సంస్థ గతంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకి దాదాపు 28కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు బ్యానర్లు కలిసి పలు సినిమాలను నిర్మించాయి. వాటి తాలూకా డీల్స్ ఫైనల్ కాలేదు. దాంతో ఈ రోస్ ఈ విషయంలో కోర్డు మెట్లు ఎక్కడంతో బాలయ్య సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇండస్ట్రీ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడంతో.. నిర్మాతల మధ్య చర్చలు జరిగి సమస్య క్లియర్ అయ్యింది. దాంతో ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేశారు టీమ్. ఈనెల 12న అఖండ2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. 11న ప్రిమియర్ షోలు పడబోతున్నాయి.

24
14 సినిమాలపై అఖండ2 దెబ్బ..

డిసెంబర్ 12న ‘అఖండ 2’ విడుదలైతే 14 సినిమాలపై ఆ ప్రభావం పడుతుందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. 14 కొత్త సినిమాలతో పాటు.. అదే రోజు 3 రీరిలీజ్ మూవీస్ కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఈసినిమా ప్రభావం గట్టిగానే చూపించబోతుంది. బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియన్స్ లో భారీగా అంచనాలు ఉంటాయి. అందులోను బోయపాటి కాంబినేషన్ అంటే.. పూనకాలతో ఊగిపోతుంటారు అభిమానులు. అఖండ సినిమాకు సీక్వెల్ గా రాబోతుండటంతో..అఖండ 2 పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ లో చిన్న సినిమాలు నలిగిపోయే ప్రమాదం పక్కాగా ఉంటుంది. దాంతో ఆల్ రెడీ రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరి ఆ సినిమాల రిలీజ్ వియంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

34
సుమకు బాలకృష్ణ భారీ షాక్

అఖండ2 రిలీజ్ డేట్ తో పాటు.. ఆ దగ్గర కొన్ని డేట్స్ లో సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. వాటిలో `సైకో సిద్ధార్థ`, `సహకుటుంబమానం`, `మౌళి`, `ఈషా`, `డ్రైవ్‌`, `అన్నగారు వస్తున్నారు` చిత్రాలు రిలీజ్‌ కాబోతున్నాయి. అంతే కాదు ఈ రిలీజ్ లలో టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషల్ నటించిన మోగ్లీ సినిమా కూడా ఉంది. ఈ మూవీ డిసెంబర్ 13న రిలీజ్ కాబోతుంది. రోషన్ ను హీరోగా నిలబెట్టాలని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సుమ, రాజీవ్. కానీ ఇప్పుడు `అఖండ 2` రిలీజ్ తో.. మోగ్లీ సినిమాకు థియేటర్లు దొరకడం ఇబ్బందిగ మారొచ్చు.. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటీ అని మేకర్స్ ఆలోచనలోపడ్డారు. అటు నందు కూడా హీరోగా నిలబడటం కోసం చాలా కష్టపడి సైకో సిద్ధార్థ మూవీ చేశాడు. అతనికి కూడా ఇది నిరాశ కలిగించే విషయమే అనుకోవాలి. మరి ఈ చిన్స సినిమాలన్నీ తమ రిలీజ్ లను వాయిదా వేసుకుంటారా లేక పోటీకి దిగుతారా అనేది చూడాలి. `అఖండ 2` దెబ్బకి ఎన్ని చిత్రాలు బ్యాక్‌ వెళ్లిపోతాయో చూడాలి.

44
అఖండ 2 కోసం అభిమానుల ఎదురు చూపులు

ఇక అఖండ2 ప్రొమోషన్స్ విషయానికి వస్తే, డిసెంబర్ 5న విడుదల అన్నునందున..మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ కూడా హిందీ ఇంటర్వ్యూలు వరుసగా ఇచ్చి చాలా వైరల్ అయ్యారు. అందువల్ల ప్రత్యేకంగా మరిన్ని ప్రమోషన్స్ ఇప్పుడు అవసరం లేదని తెలుస్తోంది. రిలీజ్ డేట్ అప్ డేట్ అయ్యేలా కొంత వరకూ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఒక ప్రెస్ మీట్ మాత్రమే నిర్వహించనున్నారని సమాచారం.బోయపాటి శ్రీను–బాలకృష్ణ కలయికపై మాస్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే విడుదల వాయిదా పడడంతో నందమూరి అభిమానుల్లో ఈసారి సినిమా భారీ విజయాన్ని సాధించాలనే ఉత్సాహం కూడా పెరిగింది. చూడదలి అఖండ2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.

Read more Photos on
click me!

Recommended Stories