Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 10, 2025, 09:43 AM IST

మహేష్‌ బాబు హీరోగా రూపొందిన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఓ స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఆయన ఎవరో తెలియదని, ప్రభాస్‌ కాకుండా అందరు పొట్టివాళ్లతోనే నటించినట్టు తెలిపింది. 

PREV
15
మహేష్‌ బాబు, ప్రభాస్‌లపై స్టార్‌ హీరోయిన్‌ కామెంట్‌

ఈ స్టార్‌ హీరోయిన్‌ మహేష్‌ బాబు సినిమాతోనే నటిగా పరిచయం అయ్యింది. ఆయన లైఫ్‌ ఇవ్వడంతోనే ఇప్పుడు స్టార్‌ అయ్యింది. కానీ ఆయనే ఎవరో తనకు తెలియదని చెప్పింది. అంతేకాదు ప్రభాస్‌ తప్ప తాను అందరు పొట్టివాళ్లతోనే పనిచేసినట్టు చెప్పి షాకిచ్చింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇంతకి ఆ హీరోయిన్‌ ఎవరనేది చూస్తే

25
మహేష్‌ తో హీరోయిన్‌గా పరిచయం అయిన కృతి సనన్‌

ఈ వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌ ఎవరో కాదు కృతి సనన్‌. ఇటీవల ఆమె తెలుగులో `ఆదిపురుష్‌`లో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ సరసన, సీత పాత్రలో నటించి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. అయితే ఈ సినిమాకి ముందే తెలుగులో ఆమె రెండు చిత్రాలు చేసింది. మహేష్‌ బాబుతో `వన్‌ నేనొక్కడినే` చిత్రంలో నటించింది. ఇది కృతి సనన్‌కి తొలి చిత్రం. ఈ మూవీతోనే ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లిపోయింది. అక్కడ వరుసగా అవకాశాలు అందుకుని స్టార్‌ అయిపోయింది. మధ్యలో నాగచైతన్యతో `దోచెయ్‌` చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆడలేదు. దీంతో మళ్లీ తెలుగులో నటించలేదు. చాలా ఏళ్ల తర్వాత `ఆదిపురుష్‌`లో చేసింది. ఇది పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం.

35
మహేష్ బాబు ఎవరో తెలియదు

తెలుగులో నటించిన మూడు సినిమాలూ పరాజయం చెందాయి. దీంతో ఇప్పుడు సౌత్‌కి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా కృతి సనన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహేష్‌ బాబు ఎవరో తెలియదని చెప్పింది. `1 నేనొక్కడనే`కి ముందు హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. అప్పటి వరకు మహేష్‌ బాబు ఎంతటి పెద్ద సూపర్‌ స్టార్‌ అనే విషయం నాకు తెలియదు. దీంతో ఆయన్ని చాలా సరదాగా కలిశాను. ఒక సీనియర్‌గానే భావించాను. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు ఆయన ఎంత పెద్ద స్టార్‌ అనే విషయం తెలిసింది` అని వెల్లడించింది కృతి సనన్‌.

45
ప్రభాస్‌ తప్ప అంతా పొట్టివాళ్లే

అంతేకాదు ప్రభాస్‌తో పోల్చుతూ ఇతర హీరోలపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ప్రభాస్‌ తప్ప తాను మిగిలిన అందరు హీరోలు హైట్‌లో తనకంటే చిన్నగా(పొట్టిగా) ఉండే వాళ్లతోనే నటించాను అని తెలిపింది. `నేను పనిచేసిన కోస్టార్స్ లో ప్రభాస్‌ ఒక్కడే పొడువైన వాడు. మిగతా అంతా పొట్టిగా ఉన్నారు. దీంతో సెట్‌లో దాన్ని సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దానికి ఫ్లాట్‌గా ఉన్న షూట్‌ ధరించి చిన్న ట్రిక్‌ ఉపయోగించేవాళ్లం`అని తెలిపింది కృతి సనన్‌.

55
మహేష్‌ని కృతి అవమానించిందా?

ఈ లెక్కన ఆమె మహేష్‌ బాబుని కూడా పొట్టిగా ఉన్నట్టుగానే వర్ణించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే మహేష్‌ని కూడా కృతి సనన్‌ అవమానించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం మహేష్‌ బాబు కూడా పొట్టి అనే మీనింగ్‌ వస్తుంది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. అయితే స్వతహాగా కృతి సనన్‌ చాలా హైట్‌ ఉంటుంది. ఆ కారణంగానే ఇతర హీరోలతో కలిసి నటించేటప్పుడు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. తాజాగా గలాట ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి ఈ వ్యాఖ్యలు చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories