వర్మ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో గాయం ఒకటని చెప్పొచ్చు. జగపతి బాబు, రేవతి జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పాటలు అప్పట్లో సమాజంపై చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. 'నిగ్గదీసి అడుగు' 'సురాజ్యం అవలేని, స్వరాజ్యం ఎందుకని' ఈ రెండు పాటలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.
అయితే నిజానికి శాస్త్రి ఈ పాటలను గాయం మూవీ కోసం రాయలేదని మీకు తెలుసా.? సిరివెన్నల తాను స్వతహాగ రాసుకున్న ఈ రెండు పాటల గురించి తెలుసుకున్న వర్మ.. ఆ పాటలను ఇతివృత్తంగా చేసుకొని గాయం సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తెలిపారు. నిజానికి ఈ పాటలు లేకపోతే అసలు గాయం అనే మూవీనే వచ్చేది కాదని చెప్పుకొచ్చారు.