ఈ విషయంతో కథ ఉత్కంఠ భరితంగా మారుతుంది. అసలు ఆ పిల్లలకు తండ్రి ఎవరు? చివరికి ఆమె ఎవరికి దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా అంతా ట్విస్ట్ లతో, కామెడీ పంచ్ లతో నిండిపోయి ఉంటుంది. సిరియస్ విషయాన్ని కూడా ఇంత సిల్లీగా చెప్పవచ్చు అని ఈసినిమా చూస్తే తెలుస్తుంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ కలగలిసిన ‘బ్యాడ్ న్యూస్’ ఓటీటీలో విభిన్న అనుభూతిని పంచుతోంది.