లీకైన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్టు ఇదేనట

Published : Aug 30, 2025, 12:15 PM IST

బిగ్బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే లాంచ్ అవ్వబోతోంది. దీనికోసం బిగ్ బాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సీజన్లోకి ఎవరు వస్తారు? అనే దానిపై ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. లీకైన సమాచారం ప్రకారం ఆ ఫుల్ లిస్టు ఇక్కడ ఇచ్చాము. 

PREV
16
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లాంఛింగ్

సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలయ్యింది. ఈ సీజన్ మరింత కొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. సాధారణంగా బిగ్ బాస్ సీజన్లో ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది. కానీ బిగ్ బాస్ 9 తెలుగులో మాత్రం రెండు ఇళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రోమో ద్వారా తెలుస్తోంది. కాగా ఈ సీజన్ కు ఎవరు వెళ్తారు? అన్నదానిపై ఇప్పటికీ ఉత్కంఠ ఉంది. అయితే కొంత సమాచారం లీక్ అయింది. దాని ప్రకారం ఎవరెవరు బిగ్బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లో తెలుసుకోండి.

26
ఈ సీజన్లో రెండు ఇళ్లు

బిగ్ బాస్ సీజన్ 9 కూడా నాగార్జుననే హోస్టుగా ఉంటున్నారు. ప్రోమోలో కూడా నాగార్జున డబుల్ హౌస్ అని చెప్పారు. అలాగే డబుల్ డోస్ అని కూడా చెప్పారు. అందులోనూ ఈసారి కామనర్స్ అధికంగా ఇంట్లోకి వెళుతున్నారు. దీన్ని బట్టి ఎంటర్టైన్మెంట్ ఫుల్లుగా ఉంటుందని అర్థం అయిపోతుంది. ఆ రెండు హౌసులలో.. ఒక హౌస్ లో సెలబ్రిటీలు ఉంటే, మరో హౌస్ లో కామనర్స్ ఉంటారు. కాబట్టి వీరిద్దరికీ పోటీ గట్టిగానే సాగుతుందని తెలుస్తోంది.

36
అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ఎంపిక

అందుకే కామనర్స్ ను ఎంపిక చేయడం కోసం అగ్నిపరీక్ష అనే షోను కూడా నిర్వహిస్తున్నారు. వేలాదిమంది నుంచి 40 మందిని సెలెక్ట్ చేసి వారికి కఠినమైన పరీక్షలను పెడుతున్నారు. గెలిచిన టాప్ త్రీ లేదా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ లోకి పంపి అవకాశాలు ఉన్నాయి. ఈ షోకు ఇప్పటికే తమ సత్తా నిరూపించుకున్న బిగ్ బాస్ పాత సీజన్ కంటెస్టెంట్లు బిందు మాధవి, నవదీప్, అభిజిత్ జడ్జిలుగా ఉన్నారు.

46
ఈసారి సీరియల్ హీరోయిన్లు

ఇక కంటెస్టెంట్ జాబితా విషయానికి వస్తే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కొంతమంది కచ్చితంగా ఈ సీజన్లో ఉంటారని తెలుస్తుంది. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, సీరియల్ హీరోయిన్లు తేజస్విని, కావ్యశ్రీ, దేబ్జాని, నవ్య స్వామి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని సమాచారం. వీరందరికీ కూడా అభిమానులు అధిక స్థాయిలోనే ఉన్నారు. దీన్నిబట్టి ఈసారి గెలుపు అంత సులువుగా ఉండదు.

56
టాప్ సీరియల్ హీరో కూడా

అలాగే గుప్పెడంత మనసు సీరియల్ తో అందరికీ హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు ముఖేష్ గౌడ. అతడు కూడా బిగ్బాస్ సీజన్ 9లో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్, బ్రహ్మముడి హీరోయిన్ దీపిక కూడా ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో పొట్టి దుస్తులతో దుమ్మురేపుతున్న రీతు చౌదరి కూడా ఈ సీజన్లో కనిపించవచ్చు. ఇక మై విలేజ్ షోతో క్రేజ్ సంపాదించిన అనిల్ గీలా కూడా ఈసారి హౌస్ లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల్లో కనిపించే ఛత్రపతి శేఖర్, హీరో సుమంత్ అశ్విన్ కూడా ఈసారి హౌస్ లోకి వెళ్ళవచ్చు. సినిమాలో హీరోగా చేసి ఇప్పుడు సీరియల్ లో పెద్దరికం పాత్రలు చేస్తున్న సాయికిరణ్ కూడా సీజన్ 9లో కనిపించే అవకాశాలు ఉన్నాయి.

66
అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి కూడా

బిగ్బాస్ సీజన్ 9లో పైన చెప్పిన కంటెస్టెంట్స్ అందరూ ఉంటే మాత్రం ప్రేక్షకులకు పండగే. ఎందుకంటే అందులో సగానికిపైగా మందికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్టు అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా బోలెడంత నెగెటివిటీని మూట కట్టుకున్న ముగ్గురమ్మాయిల్లో ఒకరు ఆ హౌస్ లోకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రమ్య పేరే అధికంగా వినిపిస్తోంది. ఆమెకు గ్లామర్ కూడా ఉండడంతో తనను పంపించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ 7న ఎవరెవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారో తేలిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories