ఒకరు కామెడీ, మరొకరు కాంట్రవర్సీ.. బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్మాన్యుయేల్, దివ్వల మాధురి

Published : Aug 30, 2025, 01:29 PM IST

జబర్దస్త్ లో నవ్వులు పూయించి కమెడియన్ గా గుర్తింపు పొందిన ఇమ్మాన్యుయేల్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ తప్పకుండా బిగ్ బాస్ 9కి ప్లస్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. 

PREV
15

కింగ్ నాగార్జున హౌస్ గా బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సామాన్యులని ఎంపిక చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. అగ్నిపరీక్ష ద్వారా ఐదుగురు సామాన్యులని హౌస్ లోకి పంపేందుకు ఎంపిక చేస్తారు. ఇక హౌస్ లోకి నేరుగా వెళ్లే సెలెబ్రిటీల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ కంఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. 

25

జబర్దస్త్ లో నవ్వులు పూయించి కమెడియన్ గా గుర్తింపు పొందిన ఇమ్మాన్యుయేల్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ AV షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇమ్మాన్యుయేల్ కామెడీ టైమింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ తప్పకుండా బిగ్ బాస్ 9కి ప్లస్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. 

35

తప్పకుండా ఇమ్మాన్యుయేల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాడు. కానీ కఠినమైన టాస్క్ లు, హౌస్ లో జరిగే వివాదాలని ఇమ్మాన్యుయేల్ ఎలా అధికమిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హౌస్ లో ఇమ్మాన్యుయేల్ ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి. 

45

మరోవైపు మోస్ట్ కాంట్రవర్షియల్ సెలెబ్రిటీ దివ్వల మాధురి కూడా బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ తో ఆమె రిలేషన్ లో ఉంటూ తీవ్రమైన వివాదంలో నిలిచారు. సోషల్ మీడియాలో దివ్వల మాధురి ఇప్పటికీ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. 

55

అయినప్పటికీ డోంట్ కేర్ అనే నైజం ఆమెది. ఎవరు ఏమనుకున్నా దువ్వాడ శ్రీనివాస్ తో తన రిలేషన్ కొనసాగుతుంది అని బోల్డ్ గా ప్రకటించారు. ఇద్దరూ జంటగా అనేక కార్యక్రమాల్లో మెరిశారు. దివ్వల మాధురి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనే అవకాశం ఆమెకి దక్కిందట. ఇలాంటి కాంట్రవర్షియల్ సెలెబ్రిటీ బిగ్ బాస్ 9లో పాల్గొంటే షోకి తప్పకుండా ఎక్స్ట్రా మైలేజీ లభిస్తుందని నెటిజన్లు అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories