బాహుబలి రిటర్న్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే, సరికొత్త టెక్నాలజీతో.. ఒక్కటిగా రిలీజ్ కానున్న 2 సినిమాలు

Published : Oct 25, 2025, 03:38 PM IST

బాహుబలి ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త.. బాహుబలి రెండు సినిమాలు కలిసి ఒక్క సినిమాగా థియేటర్లలోసందడి చేయబోతున్నాయి. బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈసినిమా ట్రైలర్ చూశారా? 

PREV
14
అద్భుత దృశ్య కావ్యం

స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా బాహుబలి. ఈసినిమాతోనే టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇండియాన్ సినిమా హిస్టరీలో బాహుబలి సృష్టించిన రికార్డ్స్ ను దాటడానికి పెద్ద సినిమాలన్నీపోటీపడుతున్నాయి. ఒక రకంగా ఇండియాన్ సినిమా పరిస్థితి బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అన్నవిధంగా తయారయ్యింది.

24
రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి ది ఎపిక్

మరోసారి వెండితెరపై మాయ చేయడానికి సిద్ధమైంది బాహుబలి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రియులు దిల్ కుష్ అయ్యేలా.. ఈసినిమా సరికొత్త హంగులతో రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యి, పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మళ్లీ విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఒక్క పార్ట్ ను కాకుండా.. ఈసారి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

34
బాహుబలి ది ఎపిక్ ట్రైలర్

బాహుబలి గ్రాండ్ రిలీజ్ సందర్భంగా.. మూవీ టీమ్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండు సినిమాలకు సబంధించిన అద్భుతమైన దృశ్యాలతో, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేవిధంగా ఉంది. అంతే కాదు ప్రేక్షకులకు సరిక కొత్త అనుభూతిని అందించేందుకు రీ రిలీజ్ వెర్షన్‌లో అనేక సాంకేతిక మార్పులు చేశారు. మూవీ క్యాలిటీని ఇంకాస్త అప్ డేట్ చేసే విధంగా రీమాస్టర్ చేసిన పిక్చర్, సౌండ్ క్వాలిటీని అత్యాధునిక టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశారు. ఈసారి బాహుబలి మూవీ ఐమాక్స్, 4డీఎక్స్, డాల్బీ సినిమాస్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.

44
మరోసారి రికార్డులు బ్రేక్ చేస్తుందా?

ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని విధంగా ‘బాహుబలి’ వరల్డ్ ను బిగ్ స్క్రీన్ పై మరోసారి ఆస్వాదించే విధంగా మార్పులు జరుగుతున్నాయి. బాహుబలి రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ సినిమా 3 గంటల 44 నిమిషాల డ్యూరేషన్ తో రిలీజ్ కాబోతోంది. అంతే కాదు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) నుంచి ఇప్పటికే అనుమతి కూడా రావడంతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి రీరిలీజ్ వెర్షన్ బాహుబలి మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈసినిమా ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 లో రిలీజ్ అవ్వగా.. బాహుబలి: ది కన్‌క్లూజన్’ 2017 లో విడుదలయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories